ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు పలువురు ప్రముఖులు స్టేడియంకు వచ్చారు. అందులో సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ కూడా ఉంది. ఇప్పటికే టీమిండియా ఆడిన పలు మ్యాచ్లకు ఎంకరేజ్ చేయగా.. మరోసారి తళుక్కుమంది. టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కెమెరామెన్ సారాను చాలాసార్లు చూపెట్టాడు. ఎందుకంటే శుభమాన్ గిల్ క్రీజులో ఉన్నాడు కాబట్టి. ఇంతకుముందు గిల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తెగ ఎంకరేజ్ చేసిన సారా టెండూల్కర్.. ఈసారి కూడా గిల్ బ్యాటింగ్ చేస్తున్న…
శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో ఇద్దరు టీమిండియా బ్యాటర్లు సెంచరీల దగ్గరకు వచ్చి ఔట్ అయ్యారు. గిల్ 93 పరుగుల వద్ద ఔట్ కాగా, కోహ్లీ 88 పరుగుల వద్ద పెవిలియన్ బాట పట్టాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
ప్రపంచకప్ 2023లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. టీమిండియా ఆడిన 6 మ్యాచ్‌ల్లో గెలిచి 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇదిలా ఉంటే.. టీమిండియా రథసారధి రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ దిగ్గజం వసీం అక్రమ్ పొగడ్తల జల్లు కురిపించాడు. రోహిత్ శర్మ పుట్టుకతో వచ్చిన నాయకుడని వసీం అక్రమ్ అన్నారు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియాను నిలువరించడం అసాధ్యమని పేర్కొన్నాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బాల్ కొడితే సిక్సర్ పోవాల్సిందే. టీమిండియా యువ బ్యాట్స్మెన్ రింకూ సింగ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పంజాబ్‌తో ఈరోజు జరిగిన క్వార్టర్‌ఫైనల్-1లో రింకూ చెలరేగిపోయాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయమైన 77 పరుగులు చేశాడు.
2023 ప్రపంచకప్‌లో భాగంగా.. భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు 168వ మ్యాచ్. ఇప్పటి వరకు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా 98 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టై కాగా, 11 మ్యాచ్‌లు ఫలితం తేలలేదు. ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. ఇక.. వికెట్ల పరంగా ముత్తయ్య మురళీధరన్ నంబర్-1 స్థానంలో ఉన్నాడు.
పంచకప్ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా-శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి ఓవర్లనే మొదటి వికెట్ కోల్పోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం భారత్ స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 60 పరుగులు. క్రీజులో ఓపెనర్ శుభ్ మాన్ గిల్(22), విరాట్ కోహ్లీ(28) ఉన్నారు.
బంగ్లాదేశ్‌తో మ్యాచ్ గెలిచిన తర్వాత పాకిస్తాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగా మిగిలి ఉన్నాయి. అటు పాయింట్ల పట్టికలో పాకిస్తాన్.. 5వ స్థానానికి ఎగబాకింది. పాక్ 7 మ్యాచ్‌ల్లో 3 గెలువగా.. నాలుగింటిలో ఓడిపోయింది. అయితే.. ఈ విక్టరీ తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజం తన స్పందనను తెలిపాడు. ప్రపంచకప్‌లో రాబోయే మ్యాచ్‌లలో తమ జట్టు వ్యూహం గురించి చెప్పాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా ఈరోజు ఈడెన్ గార్డెన్స్ లో పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఈజీ విక్టరీ పొందింది. పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే పాకిస్తాన్ ఈ విజయం తర్వాత.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీనిపై బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. బ్యాంకుల్లో అట్రిషన్ రేటును ఆర్‌బీఐ నిశితంగా పరిశీలిస్తోందని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. కొన్ని ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాలు వదులుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందని ఆయన అన్నారు.