కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి పర్యటించారు. పొందుర్తి వద్ద ఆయనకు బీజేపీ శ్రేణులు భారీగా బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. అనంతరం రాజారెడ్డి గార్డెన్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్ష 20 వేల కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే కుంగిపోతుందని విమర్శించారు. 80 వేల కోట్ల రూపాయల అప్పు తెచ్చాడు.. కాళేశ్వరం కూలిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం ఆగం అబద్ధాలు చెబుతారని కేసీఆర్ అన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయి, ఎవ్వరో ఒక్కరు గెలుస్తారని చెప్పారు. ఎన్నికల్లో నిలబడే వ్యక్తి ఎవ్వరో చూడాలని.. ఏ పార్టీ చరిత్ర ఏంటో చూడాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఓటు వజ్రాయుధం.. ఆలోచించి ఓటు వేయాలని ఆయన తెలిపారు.
స్ట్రాంగ్ లీడర్ కేసీఆర్ ఉండగా.. రాంగ్ లీడర్లు మనకెందుకు అని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కర్ణాటక పరిస్థితి తెలంగాణలో వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రోగ్రాం సంగారెడ్డిలో ఫెయిల్ అయ్యిందన్నారు. సంగారెడ్డి జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చిన మన మీటింగ్ కి వచ్చినంత మంది రాలేదని వ్యంగాస్త్రాలు సంధించారు.
ప్రపంచకప్‌లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్ లో చెత్త రికార్డు నమోదైంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఘోర పరాజయం పొందింది. తొలి బంతికే ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు. శ్రీలంక జట్టు వికెట్ల పతనం అక్కడి నుంచి ప్రారంభమైంది. కేవలం…
ప్రపంచకప్ 2023లో భాగంగా.. ఈరోజు జరిగిన మ్యాచ్లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో చెలరేగడంతో లంకను 55 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో 302 పరుగుల తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు బెర్త్ ఖాయం చేసుకుంది.
జస్ప్రీత్ బుమ్రా వన్డే ప్రపంచ కప్ 2023లో ఓ అరుదైన ఘనత సాధించాడు. 48 ఏళ్ల వరల్డ్ కప్ చరిత్రలో ఏ ఇండియన్ బౌలర్ చేయలేని ఘనతను సాధించాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లనే తొలి బంతికే వికెట్ తీశాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ మిస్ అయినప్పటికీ.. అతను అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. గిల్ 92 బంతుల్లో 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. శుభ్‌మన్ గిల్ క్రీజులో నుంచి ముందుకొచ్చి ఆఫ్ సైడ్ అద్భుత షాట్ ఆడాడు. అది చూసి నాన్-స్ట్రైక్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.
వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఇండియా-శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా లంకేయుల ముందు భారీ స్కోరును ఉంచారు. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. మిడిలార్డర్లో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయాస్ అయ్యర్.. ఓ భారీ సిక్సర్ కొట్టాడు. 36 ఓవర్‌లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్ మీదగా అయ్యర్ సిక్స్ బాదాడు. అతను కొట్టిన షాట్‌కి బాల్ 106 మీటర్ల దూరం వెళ్లింది.
శ్రీలంక ముందు టీమిండియా 358 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 357 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్లు రాణించడంతో టీమిండియా భారీ స్కోరును నమోదు చేసింది.
టీమిండియా యువ ఓపెనర్ శుభ్మాన్ గిల్ తన జెర్సీ నంబర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన జెర్సీపై జెర్సీ నంబర్ 77ని ఎలా పొందాడనే దానిపై ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ఇటీవల స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. జెర్సీ నంబర్ 77ని పొందడం, దానితో ఎలా ఆడుతున్నాడనే దాని గురించి వెల్లడించాడు.