Janareddy: ఈరోజు (శుక్రవారం) మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జానారెడ్డి తనయుడు రఘువీరారెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. రాష్ట్రంలో నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విస్పర్ వ్యాలీ విల్లాలోని రఘువీరారెడ్డి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. అంతేకాకుండా… కాంగ్రెస్ నేతలకు చెందిన 18 చోట్ల ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా, నిన్న ఉదయం నుంచి బడంగ్ పేటకు చెందిన కాంగ్రెస్ నేతలు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పారిజాత లక్ష్మీనరసింహారెడ్డి నివాసాల్లో ఇన్‌కంటాక్స్ అధికారులు సోదాలు చేపట్టారు.
Read Also: Samantha: సామ్.. నువ్వెందుకని మార్వెల్ సిరీస్ లో నటించకూడదు
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఇళ్లలో ఐటీ దాడులపై జానారెడ్డి స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలా ఉంది కాబట్టి ఐటీ దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి, బెదిరించడానికే ఈ దాడులని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడం కోసమే ఐటీ దాడులని… ఈ దాడులు జరిగినా ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తున్నామని జానారెడ్డి పేర్కొన్నారు.
Read Also: Realme narzo: రియల్‌మీ ఫోన్‌పై భారీ తగ్గింపు.. రూ. 10 వేలలోపే 50 ఎంపీ కెమెరా ఫోన్..