ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగానే.. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా అక్కడి జనాలకు ఓ హామీ ఇచ్చారు. సోమవారం విదిశలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో మధ్యప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి ఖర్చు లేకుండా రాష్ట్ర ప్రజలకు అయోధ్య రామ మందిర దర్శనం కల్పిస్తామన్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జంక్షన్‌లో రైలు అగ్ని ప్రమాదానికి గురైంది. బీహార్ వెళ్తున్న దిబ్రూగఢ్-లాల్‌ఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని జనరల్ కోచ్‌లో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ (CFO) చంద్ర మోహన్ శర్మ తెలిపారు.
కేరళ ఆర్థిక సంక్షోభానికి కారణం మీరంటే మీరేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వమే కారణమని.. ప్రభుత్వం వృథా ఖర్చులు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంక్షోభానికి కేంద్ర విధానాలే కారణమని కేరళ ప్రభుత్వం ఆరోపిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాసింజర్ రైలు ఇంజిన్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతకుముందే.. రైలు ఇంజన్‌లో యువకుడి మృతదేహం ఇరుక్కోవడంతో కొన్ని కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లింది. ఇంజిన్లో మృతదేహాన్ని చూసిన అక్కడి జనాలు పెద్దగా అరుపులు చేయడంతో అది గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. దీంతో ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు.
ఈనెల 15న బీవై విజయేంద్ర కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక బీజేపీకి కొత్త చీఫ్ నియమితులైన సంగతి తెలిసిందే. కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న నళిన్ కటీల్ స్థానంలో విజయేంద్రని కొత్త అధ్యక్షుడిగా బీజేపీ నియమించింది. ప్రస్తుతం విజయేంద్ర కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నారు.
మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిటీ యొక్క తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)ని ఐదేళ్లపాటు చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది.
బీహార్‌లోని కైమూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో స్నానానికి దిగి ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో నలుగురు అబ్బాయిలు ఉండగా.. ఒక అమ్మాయి ఉంది. స్థానికులు చెరువులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. ఈ ఘటనతో చిన్నారుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఘటనాస్థలానికి చేరుకున్న చిన్నారుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా దు:ఖ సాగరంలో నిండిపోయింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎంపి మహువా మోయిత్రాకు ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. పశ్చిమ బెంగాల్‌లోని కృష్ణానగర్ (నాడియా నార్త్) అధ్యక్షురాలిగా మొయిత్రాను టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ నియమించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్‌లో పనిచేసే మహిళ ఉద్యోగిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. జాయ్‌నగర్‌లోని తన ఇంటి వద్దే సైఫుద్దీన్ లస్కర్ ను కాల్చి చంపారు. దీంతో టీఎంసీ నాయకులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశారు. అంతేకాకుండా.. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు.