సిద్ధిపేట జిల్లా గజ్వేల్ (మం) దాతారుపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిని దుండుగులు దారుణంగా హత్య చేశారు. రాజవ్వ (80) అనే వృద్ధురాలి నోట్లో యాసిడ్ పోసి, గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడ్డారు. అనంతరం రాజవ్వ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, కాళ్ళ పట్టీలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు అవినీతి జరిగిందని ఆరోపించడం రేవంత్ రెడ్డి అజ్ఞానానికే తార్కాణమని మంత్రి కొప్పుల అన్నారు. 2018 ఎన్నికపై ఈవీఎంల ట్యాంపరింగ్ చేసాను అన్న రేవంత్ రెడ్డి మాటలు.. ఎన్నికల కమిషన్ కించపరచడమే అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు. ఇకనైనా బుడ్డర్ కాన్ వేషాలు మానుకోవాలని రేవంత్ పై విమర్శలు గుప్పించారు.
గువ్వల బాలరాజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనపై దాడి చేసిన వారి గురించి బయటపెట్టారు. తెలంగాణలో ఎన్నడూ లేని ఆనవాయితీని కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మధ్యనే కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడి చేశారు.. నిన్న నామీద దాడిచేశారన్నారు. నిన్న ప్రచారం ముగించుకొని వెళ్తుండగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తన కాన్వాయ్ ని వెంబడిస్తూ అచ్చంపేట రాగానే ఆపి తన మీద దాడికి దిగారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ గతంలో…
అంబర్పేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్.. బాగ్ అంబర్పేట డివిజన్లోని తురాభ్ నగర్, ఎరుకల బస్తీలో ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా.. డివిజన్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, మహిళా నాయకులు, ముఖ్య నేతలు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ ప్రచారంలో బస్తీ వాసులు కాలేరు వెంకటేష్ కు గులాబీ పూలతో పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.
కాంగ్రెస్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి పేరు కాస్త రేటెంత రెడ్డి అని పిలిచే కాడికి వచ్చిందని విమర్శించారు. బీఆర్ఎస్ పై అహంకారంతో, బలుపెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అంతేకాకుండా.. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు.
మెదక్ జిల్లాలో పండగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు పిల్లలతో స్కూటీపై వెళ్తున్న తల్లిని టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు కుమారులు మృతి చెందారు. తల్లి స్వల్ప గాయాలతో బయటపడింది.
ఎట్టకేలకు ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ విజయంతో ముగించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈరోజు ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 93 పరుగుల తేడాతో గెలుపొందింది. 338 పరుగుల టార్గెట్ ను చేధించేందుకు బరిలోకి దిగిన పాక్.. 246 పరుగులకు ఆలౌటైంది.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఓ రైతును పోలీసులు అన్యాయంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులపై మృతుడి కుటుంబీకులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.
ప్రపంచకప్ 2023లో తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో నవంబర్ 15న ఈ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ మ్యాచ్ నవంబర్ 16న కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో జరుగనుంది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
పాకిస్తాన్ లో జరిగిన ఓ టోర్నమెంట్ మ్యాచ్ లో ఇద్దరు బ్యాట్స్ మెన్లు కొట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెట్ లో ఇలాంటి పరిణామాలు ఎక్కడ చూసి ఉండరు. సాధారణంగా క్రికెట్ లో గొడవలు జరిగితే ప్రత్యర్థి టీమ్ తో జరుగుతుంది. కానీ ఇక్కడ ఇద్దరు ఒకే జట్టు బ్యాట్స్ మెన్లు బ్యాట్లతో పొట్టుపొట్టు కొట్టుకున్నారు.