ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్యాసింజర్ రైలు ఇంజిన్‌కు వేలాడుతున్న యువకుడి మృతదేహాన్ని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అంతకుముందే.. రైలు ఇంజన్‌లో యువకుడి మృతదేహం ఇరుక్కోవడంతో కొన్ని కిలోమీటర్ల మేర అలానే ఈడ్చుకెళ్లింది. ఇంజిన్లో మృతదేహాన్ని చూసిన అక్కడి జనాలు పెద్దగా అరుపులు చేయడంతో అది గమనించిన లోకో పైలట్ రైలును ఆపాడు. దీంతో ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. ఫరూఖాబాద్-షికోహాబాద్ రైలు మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Read Also: UK Cabinet Reshuffle Update: రిషి సునక్ మంత్రివర్గంలో బ్రిటిష్ మాజీ ప్రధానికి చోటు..
అనంతరం.. రైలు ఇంజిన్‌లో చిక్కుకున్న యువకుడి మృతదేహంపై రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అక్కడున్న రైల్వే కార్మికులు ఇంజిన్‌లో చిక్కుకున్న యువకుడి మృతదేహాన్ని బయటకు తీశారు. ఆ తర్వాత రైల్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడి చేరుకుని.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే మృతుడు ఎవరు అనేదానిపై గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మృతుడు హాఫ్ జాకెట్, గళ్ల చొక్కా, జీన్స్ ధరించి ఉన్నాడు.
Read Also: Honda New Bike : హోండా నుంచి మార్కెట్ లోకి మరో కొత్త బైక్.. సూపర్ ఫీచర్స్..
ఇదిలా ఉంటే.. యువకుడి మృతదేహం ఇంజిన్ ముందు ఎలా ఇరుక్కుపోయిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. బరాతర స్టేషన్ సూపరింటెండెంట్ తెలిపిన సమాచారం ప్రకారం.. ఫరూఖాబాద్ నుంచి షికోహాబాద్‌కు వస్తున్న ప్యాసింజర్ రైలు ఇంజన్ ముందు దూకి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. ఈ క్రమంలోనే ఇంజిన్‌లో యువకుడు ఇరుక్కున్నట్లు తెలిపారు. ఈ ఘటన భుదా బర్త్రా-అరాన్ మధ్య జరిగిందని అతను చెప్పారు. ఇంజన్‌లో మృతదేహం ఇరుక్కుపోయి ఉండటాన్ని గ్రామస్థులు చూడగానే రైలును నిలిపివేసి ఇంజిన్‌లో నుంచి బయటకు తీశామని తెలిపారు.