Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మెయిటీ యొక్క తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA)ని ఐదేళ్లపాటు చట్టవిరుద్ధమైన సంఘంగా ప్రకటించింది. అంతేకాకుండా.. ఆ పార్టీ రాజకీయ విభాగాలైన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (RPF), యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ (UNLF)లను కూడా ఐదేళ్లపాటు చట్టవిరుద్ధమైన సంస్థలుగా హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Read Also: Childrens died: బీహార్‌లో తీవ్ర విషాదం.. చెరువులో మునిగి ఐదుగురు చిన్నారులు మృతి
మరోవైపు.. PLA ఆర్మీ వింగ్ మణిపూర్ పీపుల్స్ ఆర్మీ (MPA)పై కూడా ఈ చర్య తీసుకున్నారు. పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కంగ్లీపాక్ (PREPAK), రెడ్ ఆర్మీ, కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP)లకు కూడా హోం మంత్రిత్వ శాఖ ఐదేళ్లపాటు నిషేధించింది.
Read Also: BRS Legal Team: కాంగ్రెస్ పార్టీపై సీఈఓ వికాస్ రాజ్ కు బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు
మే 3న కుకీ, మెయిటీ కమ్యూనిటీల ప్రజల మధ్య ఘర్షణలతో మణిపూర్ హింసాత్మక జ్వాలలతో అట్టుడికింది. ఈ హింసాకాండలో ఇప్పటివరకు 150 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. అంతేకాకుండా.. హింస కారణంగా వేలాది మంది ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లవెళ్లారు. దీంతో పాటు వేలాది మందిని సహాయక శిబిరాల్లో ఉంచారు.