రేపు (ఆదివారం) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య టైటిల్ పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోరులో గెలిచిన జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో రెండుజట్ల స్కోర్ సమం అయితే విన్నర్ ఎవరని తేలేవరకు సూపర్ ఓవర్లు ఉంటాయి. అందులోనూ ఫలితం తేలకపోతే మరో సూపర్ ఓవర్ ఉంటుంది.
Read Also: Rohit Sharma: రూ.275 స్కూల్ ఫీజ్ చెల్లించలేని స్థితిలో రోహిత్ శర్మ కుటుంబం.. ఆ తర్వాత అంతా చరిత్రే..
ఇంతకు ముందు.. ఈ వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ మ్యాచ్ లకు, ఫైనల్ మ్యాచ్ కు వాతావరణ మార్పుల వల్ల మ్యాచ్ జరగని పరిస్థితి ఏర్పడితే రిజర్వ్ డే ఉంటుందని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ రేపు అహ్మదాబాద్ లో వర్షం పడి మ్యాచ్ జరగకుండ ఉంటే.. మ్యాచ్ ను తర్వాత రోజుకు కేటాయించనున్నారు. ఆరోజు కూడా.. మ్యాచ్ జరగడం సాధ్యం కాకపోతే ఇరు జట్లను సంయుక్తంగా విజేతలుగా ప్రకటిస్తారు.
Read Also: Hardik Pandya: ఎంతో మంది భారతీయుల కల.. కప్ గెలవాలి..
కానీ.. అహ్మదాబాద్ లో వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉండవని వాతావరణశాఖ ప్రకటించింది. రేపు వర్షం కురిసే అవకాశమే లేదని, ఆకాశం నిర్మలంగా ఉంటుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని పేర్కొంది.