Team India: ఫైనల్‌లో టీమిండియా ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో మూడోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలన్న భారత జట్టు కల చెదిరిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియా ముందు 241 పరుగుల లక్ష్యం పెట్టింది. దీన్ని ఆసీస్.. 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఆస్ట్రేలియా విజయంలో వీరుడిగా నిలిచాడు. ఒకానొక సమయంలో ముగ్గురు ఆస్ట్రేలియా బ్యాటర్లు 48 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నారు. అయితే ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుస్‌చాగ్నే టీమిండియాపై ఎదురుదాడికి దిగి విశ్వవిజేతగా నిలిచారు. అయితే, టీమిండియా ఓటమికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.
World Cup Final 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ
Also Read
- Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
పేలవమైన ఫీల్డింగ్
టీమిండియా 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. అలాంటి పరిస్థితిల్లో.. భారత ఫీల్డర్ల నుండి మంచి ఫీల్డింగ్ ఆశిస్తారు. కానీ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఫీల్డర్లు నిరాశపరిచారు. భారత ఫీల్డర్లు రనౌట్ అయ్యే అనేక అవకాశాలను కోల్పోయారు.
షమీ, బుమ్రా, జడేజా బౌలింగ్
ఈ ప్రపంచకప్ టోర్నీలో భారత బౌలర్లు మంచి ప్రదర్శన చూపించారు. కానీ టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ల ముందు బొక్కాబోర్లా పడ్డారు. జస్ప్రీత్ బుమ్రాతో పాటు మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ రాణించలేకపోయారు. టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు పేలవంగా కనిపించారు.
చెత్త షాట్లు ఆడి నిరాశపరిచారు
టాస్ ఓడి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియా బ్యాట్స్ మెన్లు ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్ బాట పట్టారు. ఆస్ట్రేలియన్ బౌలర్లు విజృంభణతో టీమిండియా బ్యాట్స్‌మెన్లు చెత్త షాట్లు ఆడి వికెట్లను పోగొట్టుకున్నారు. టీమిండియా తరుపున విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మాత్రమే యాభై పరుగుల మార్కును టచ్ చేయగలిగారు. మిగతా బ్యాట్స్‌మెన్ ఫ్లాప్ షో చూపించారు.
భారత బౌలర్లు ఎక్స్ ట్రా పరుగులు ఇచ్చారు
భారత బౌలర్లు చాలా అదనపు పరుగులు ఇచ్చారు. ముఖ్యంగా ప్రారంభంలో.. మహ్మద్ షమీ తన లైన్ అండ్ లెంగ్త్ నుండి తప్పుకున్నట్లు కనిపించాడు. ఇతర బౌలర్ల పరిస్థితి కూడా అలాగే ఉంది. టీమిండియా బౌలర్లు పేలవమైన లెంగ్త్‌లలో బౌలింగ్ చేశారు. దీంతో ఆసీస్ బ్యాట్స్‌మెన్లు సులభంగా పరుగులు చేశారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కూడా చాలా మిస్ ఫీల్డ్‌లు చేశాడు. భారత బౌలర్లు 18 ఎక్స్ ట్రాలు ఇచ్చారు. ఇందులో 7 బైలు, 11 వైడ్‌లు ఉన్నాయి.
ట్రావిస్ హెడ్ తారుమారు చేశాడు
240 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. 7 ఓవర్లలోపే ముగ్గురు బ్యాట్స్‌మెన్లు 48 పరుగులకే ఔటయ్యారు. దీంతో భారత అభిమానుల ఆశలు చిగురించాయి.. కానీ ట్రావిస్ హెడ్ మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఆచితూచి నిలకడగా ఆడి ట్రావిస్ హెడ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో 120 బంతుల్లో 137 పరుగులు చేసిన తర్వాత ట్రావిస్ హెడ్ పెవిలియన్‌కు వెళ్లాడు. అయితే అప్పటికి ఆస్ట్రేలియా విజయం ఖాయమైంది.
తాజావార్తలు
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
-
Sri City Boiler Blast: శ్రీ సిటీలో ఘోర ప్రమాదం.. టిల్ హెల్త్‌కేర్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఇద్దరు మృతి
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!