బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జి. వినోద్ ఇంటిపై ఈడీ అధికారులు ఆకస్మిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. వినోద్‌తో పాటు ఆయన అనుచరులు, బంధువులు, మాజీ క్రికెటర్లు శివలాల్ యాదవ్, ఆయూబ్ ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు చేపట్టారు. హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వినోద్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతిపై తెలంగాణ ఏసీబీ అధికారులు మూడు ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ల ఆధారంగా ఈడీ అధికారులు వినోద్ ఇంట్లో, ఆయన అనుచరుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. అంతకుముందు.. గడ్డం వినోద్ కుమార్ తమ్ముడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
Read Also: AOB: ఏవోబీలో భద్రతా బలగాలకు తప్పిన పెనుముప్పు
ఈ క్రమంలో.. మాజీ ఎంపీ గడ్డం వినోద్ ఇంట్లో సోదాలపై ఈడీ ఓ ప్రకటన చేసింది. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో గడ్డం వినోద్ పెద్ద ఎత్తున అక్రమ లావాదేవీలు బయటపడ్డాయని తెలిపారు. దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలను గుర్తించినట్లు ఈడీ ప్రకటించింది. అంతేకాకుండా.. భారీ ఎత్తున అక్రమ లావాదేవీలు జరిపినట్లుగా గుర్తించింది ఈడీ. నకిలీ పత్రాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా గుర్తించారు. యశ్వంత్ రియాల్టీతో పాటుగా గడ్డం వినోదు భార్య పేర్లతో భారీగా ఆస్తులను గుర్తించారు. అంతేకాకుండా.. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఎలాంటి వ్యాపారం లేకపోయినా భారీగా లావాదేవీలు జరిపినట్లు తెలుసుకున్నారు. దీంతో ఫెమా చట్టం కింద వినోద్ పై కేసులు నమోదు చేశారు. విజిలెన్స్ సెక్యూరిటీ పేరుతో ఇప్పటివరకు 20 లక్షల రూపాయల టాక్స్ చెల్లించినట్లు ఈడీ గుర్తించింది.
Read Also: Harish Rao: ఒకటి, రెండు సీట్లకే బీజేపీ అధికారంలోకి వస్తుందా?