ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నాయకులు చేరికలు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో మహేశ్వరం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన దాసర్లపల్లి గ్రామానికి చెందిన ఉప్పల మహేందర్.. మహేశ్వరం BSP అభ్యర్ధి కొత్త మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీలో చేరారు. బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డికి తన మద్దతు ప్రకటిస్తూ.. ఆయన తన మద్దతుదారులతో కలిసి ఈరోజు కొత్త మనోహర్ రెడ్డి సమక్షంలో బీఎస్పీ పార్టీ కండువా కప్పుకున్నారు.
Read Also: Paddy Cultivation : వరిలో తెగుళ్ల నివారణ చర్యలు..
ఈ సందర్భంగా ఉప్పల మహేందర్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతున్న కొత్త మనోహర్ రెడ్డి గెలుపుకోసం తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఎస్పీ పార్టీ గెలుపుకోసం, తనకు మద్దతు ప్రకటించిన మహేందర్ కు, ఆయన అనుచరులకు పార్టీలో సముచితస్థానం కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Also: PM Modi: “AI సమాజానికి రక్షణగా ఉండాలి”.. జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోడీ..