సంగారెడ్డిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను అభివృద్ధి చేయడం కంటే అప్పుల కూపీలోకి తీసుకెళ్లారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ దోపిడీ తెలంగాణలో సాగుతుందని.. కేసీఆర్ పాలనలో భారీ అవినీతి జరుగుతుందని ఆయన మండిపడ్డారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి లకుమాదేవి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. కూకట్పల్లి డివిజన్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. మహిళలు మంగళ హారతులతో దీవించారని అన్నారు.
దేశ ద్రోహం కేసు, తెల్గి స్కాంలో మూడేళ్లు జైలుకు పోయి వచ్చిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి కృష్ణ యాదవ్ అవినీతిపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబర్ పేట బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విమర్శించారు. ఈ సందర్భంగా.. ప్రచారంలో జోరు పెంచారు. ఈరోజు గోల్నాక డివిజన్లోని శంకర్ నగర్, అశోక్ నగర్ తదితర ప్రాంతాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు.
ఉత్తర కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. కర్ణాటకలోని కొల్లూరులో క్రికెటర్ శ్రీశాంత్ స్పోర్ట్స్ అకాడమీని నిర్మిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఐదుసార్లు టైటిల్ సొంతం చేసుకున్నారు. ఆ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. అంతేకాకుండా.. క్రికెట్ అభిమానులకు ఆ టీమ్ అంటే ఎంతో పిచ్చి. అలాంటిది గత సీజన్ తమ అభిమానులను ఎంతో నిరాశపరిచింది. అందుకోసమని 2024 సీజన్ పై ముంబై ఇండియన్స్ దృష్టిపెట్టింది. ఈ క్రమంలో జట్టులోకి విదేశీ ప్లేయర్లును తీసుకునే ఆలోచనలో ఉంది.
మహేశ్వరం నియోజకవర్గం నుంచి సబ్బండ వర్గాల మద్దతు అందెల శ్రీరాములుకు లభిస్తుంది. ఈ క్రమంలో.. అందెల శ్రీరాములుకు ఆటో యూనియన్లు మద్దతు పలికాయి. చలాన్లతో మా పొట్ట కొడుతున్నారని ఆటో డ్రైవర్లు అందెలకు వివరించారు. ఈ నేపథ్యంలో.. బీజేపీ అధికారంలోకి రాగానే ఆటోవాలాలకు ఉచితంగా PM ప్రమాదబీమా అందిస్తానని చెప్పారు.
పాకిస్తాన్ వక్రబుద్ధి పోనించుకోవడం లేదు. మొన్నటికి మొన్న మాజీ మిస్ ఇండియా ఐశ్వర్యా రాయ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్.. మరోసారి నోరుపారేసుకున్నాడు. ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓటమిపై విమర్శలు చేశాడు. క్రికెట్ గెలిచిందంటూ ఆయన ట్వీట్ చేశాడు.
ఇద్దరు విద్యార్థులు క్లాస్ రూంలో కొట్టుకునే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు స్టూడెంట్స్ క్లాస్ రూమ్‌లో గొడవ పడుతున్నారు. అయితే వారిద్దరూ సీటు కోసం గొడవ పడుతుండటంలా అనిపించింది. ఈ ఫైట్ కి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ఇద్దరు విద్యార్థులు సీటుకోసం ఒకరినొకరు దారుణంగా కొట్టుకున్నారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక పై అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ కప్ ఫైనల్ ఓడిన తర్వాత రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఈ మెగాటోర్నీలో తనదైన బ్రాండ్ క్రికెట్‌తో ఆకట్టుకున్న రోహిత్.. చివరకు ట్రోఫీని సాధించడంలో ఫెయిల్ అయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పై బీసీసీఐ చర్చలు మొదలు పెట్టిందట. ఈ క్రమంలో తన పేరును టీ20లకు పరిశీలించకపోయినా పర్లేదని…