MLC Kavitha: బోధన్ లో ఎమ్మెల్యే షకీల్ పై కాంగ్రెస్ దాడిని ఎమ్మెల్సీ కవిత ఖండించింది. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అభివృద్ధికి అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు. కాంగ్రెస్ నాయకుల దాడులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గమనించాలని కవిత కోరారు. ప్రతి చోట అల్లర్లు, దాడులు చేసే చరిత్ర కాంగ్రెస్ ది అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లాలకు ఐటీని విస్తరిస్తే కాంగ్రెస్ అల్లర్లను విస్తరిస్తుందని కవిత మండిపడ్డారు.
Read Also: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ అధికారి, సైనికుడి వీరమరణం..
ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి పోలీసులను బెదిరిస్తున్నారని కవిత ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు రెడ్ డైరీలో రాసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. గుండాయిజం, రౌడీయిజం చేసేవాళ్లకు ప్రజలు బుద్ది చెప్పాలని ఆమే కోరారు. బీసీ టికెట్లను అమ్ముకున్న రేవంత్ రెడ్డి.. బీసీల గురించి మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అంతర్గత గొడవలతో సతమతమౌతున్నారని ఆమే తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అస్థిరత పాలన ఉందని ఆరోపించారు. కర్ణాటకలో అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అని మాట తప్పారన్నారు. కేసీఆర్ కోరుకున్నట్లు మన బిడ్డలు డాక్టర్లు, సైంటిస్టులు కావల్నా.. లేదా బీజేపీ, కాంగ్రెస్ లు కోరినట్లు నక్సలైట్లు, లేదా పకోడీలు వేసుకునే వారు కావాలా అని ప్రశ్నించారు.
Read Also: Land Scam: మార్కాపురంలో భూమాయగాళ్లు.. 21 ఎకరాల భూమి దోపిడీ బట్టబయలు