విశాఖలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్యాన్ని.. టీమిండియా 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులు చేసింది.
ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. దీపాల కాంతులతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిలో మునిగిపోతున్నారు. రోజుకు ఒక కార్యక్రమంతో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ రోడ్డు షో నిర్వహించారు. ఈ రోడ్డు షోలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి జయప్రకాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ.. సిరిసిల్ల ఎమ్మెల్యే పేరు గుర్తు ఉందా అని గ్రామాల్లో అడిగితే ఒక్కసారి కూడా కనపడలేదు అని అంటున్నారన్నారు. 14 ఏళ్లుగా గెలిచిన కేటీఆర్ కు సిరిసిల్లలో సొంత ఇల్లు ఉందా ప్రశ్నించారు. తాను గెలిచినా.. ఓడినా…
విశాఖలో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా ముందు ఆస్ట్రేలియా భారీ టార్గెట్ ను ముందుంచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ .. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో జోష్ ఇంగ్లిస్ శతకం సాధించాడు. కేవంల 50 బంతుల్లోనే 110 పరుగులు చేశాడు.
ప్రేమ పేరుతో పదవ తరగతి చదువుతున్న మైనర్ బాలికను ఓ హిందీ టీచర్ మోసం చేశాడు. అంతేకాదు.. ఆ బాలికను కిడ్నాప్ చేసి, తాళి కూడా కట్టాడు. పెళ్లి చేసుకున్నానని చెప్పి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలో చోటు చేసుకుంది.
తెలంగాణలో బీజేపీ అగ్ర నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే.. 3 రోజుల షెడ్యూల్ రిలీజ్ అయింది. 24, 25, 26 తేదీలలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు జేపీ నడ్డా, రాజ్ నాథ్ సింగ్ వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 3 తర్వాత కొన్ని పథకాలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోదీ అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు.
ఐదు టీ20 సిరీస్ లో భాగంగా.. భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరగనుంది. విశాఖ వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫైనల్ లో ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత టీమిండియా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంటలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మానకొండూర్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి, బై బై కేసీఆర్ నినాదంతో రేవంత్ రెడ్డి కార్యకర్తల్లో జోష్ నింపారు. కరీంనగర్ గడ్డ మీద తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోనియమ్మ మాట ఇచ్చింది.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చిందని…
ఎన్నికలకు మరో వారం రోజులపాటు సమయం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ చేసుకుని ప్రచారం చేస్తున్నారు ముఖ్య నేతలు.. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి పర్యటించనున్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ. రేపు, ఎల్లుండి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొననున్నారు.