Kaleru Venkatesh: అంబర్పేట అభివృద్ధిపై కిషన్ రెడ్డి చర్చకు సిద్ధంగా ఉన్నారా అని అంబర్పేట బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సవాల్ విసిరారు. నియోజకవర్గంలోని మహంకాళి టెంపుల్ అయినా, ఎక్కడైనా సరే చర్చిద్దాం అని చెప్పారు. ప్రచారంలో భాగంగా.. ఈరోజు అంబర్పేట నియోజకవర్గంలోని చెన్నారెడ్డి నగర్, ప్రేమ్ నగర్, న్యూ పటేల్ నగర్లలో ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు కాలేరు పద్మావతి, కార్పొరేటర్ లావణ్య గోల్నాకలో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కారు గుర్తుకు ఓటు వెయ్యాలని వారు కోరారు. ఈ సందర్భంగా కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ.. ఓటర్లు ఎక్కడకు వెళ్లిన పూల వర్షం కురిపిస్తూ.. బ్రహ్మరథం పడుతున్నారని, అభివృద్ధిని చూసి ఓటు వేస్తామని చెప్పారని ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు.
Read Also: CM KCR: కాంగ్రెస్ అంటే దళారీ, పైరవీకారుల రాజ్యం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని కాలేరు వెంకటేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో ఆయనకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది.. దీంతో మరోసారి అంబర్ పేటలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపుతోనే నియోజకవర్గంలో అభివృద్ది సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: KLR: గడీల పాలన వద్దు… అందరి పాలన కావాలి: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి