CM KCR: కొడంగల్ అభివృద్ధి బాధ్యత నాది.. ఎన్ని నిధులైనా ఇస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడంగల్ నియోజక వర్గం కోస్గి ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులు కేశవరావు, కోస్గి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు రాగానే ఆగం చేసే వారు వస్తారని ఆరోపించారు. ప్రజల మధ్యన ఉండే వారికి ఓటు వేస్తే కొడంగల్ అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పార్టీల దృక్పథాన్ని చూడాలని ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
15 సంవత్సరాలు పోరాడి టీఆర్ఎస్ తెలంగాణ సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ అని విమర్శించారు. ఒకప్పుడు కొడంగలం వర్షం మీద ఆధారపడి ఉండేది.. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లేవన్నారు. మరోవైపు.. రెండు వేల పెన్షన్ ను ఐదు వేలు చేస్తామన్నారు. అంతేకాకుండా.. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని తెలిపారు. కాగా.. రైతుబందు పుట్టించిందే కేసీఆర్, బీఆర్ఎస్ అని అన్నారు. రైతు బీమా ద్వారా ఐదు లక్షల రూపాయలను ఇస్తున్నామని తెలిపారు. మరోవైపు.. రైతు బందుకు డబ్బులు ఇచ్చి కేసీఆర్ దుబారా చేస్తున్నాడు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాడు. 24 గంటల కరెంట్ వేస్ట్.. మూడు గంటల కరెంట్ చాలు అని.. రైతు 10 HP మోటార్ పెట్టుకోవాలి అని రేవంత్ రెడ్డి అంటున్నాడని చెప్పుకొచ్చారు. 10 HP మోటార్ లు పెట్టాలి అంటే 50 వేల కోట్లు కావాలని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read
Etela Rajender: రైతులకు రైతుబంధు ఇచ్చి మిగతావి బంధు చేశారు: ఈటెల
రేవంత్ పెద్ద భుకాబ్జాదారుడు అని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ధరణి తీసేస్తాము అంటున్నారని.. భూమాత అని పేరు పెడతాము అంటున్నారని తెలిపారు. ధరణి తీసేస్తే రైతు బందు ఎలా వస్తదని ప్రశ్నించారు. వీఆర్ఏ, వీఆర్ఓలను తీసుకొస్తామని అంటున్నారు.. అది మనకు అవసరమా అని కేసీఆర్ అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు. రేవంత్ కొడంగల్ నియోజకవర్గంలో ఒక్క పని చేయలేదని చెప్పారు. పని చేసే నరేందర్ రెడ్డి కావాలా.. ఫాలుతు మాటలు మాట్లాడే రేవంత్ కావాలా అని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలను కొనడానికి వెళ్లి రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి అది తనకు మెడల్ అంటున్నాడని విమర్శించారు. కాంగ్రెస్ లో 15 మంది మోపయిర్రు.. నేను సీఎం అంటే నేను సీఎం అంటున్నారని చెప్పారు. నరేందర్ రెడ్డిని గెలిపియండి, ఆయనకు ప్రమోషన్ వస్తదని కేసీఆర్ అన్నారు.
ఇంతకు ముందు మంచి నీటికి గోస ఉండేది, కానీ నేడు అది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కంటి వెలుగు అనేది దేశంలో ఎవరైనా చేశారా… మూడు కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించామని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో అంగి ఊడేదాక కొడతారు.. కొడంగల్ లో లాగు ఊడే దాక కొట్టండని విమర్శనాస్త్రాలు సంధించారు. కొడంగల్ కు ఒకరోజు వచ్చి రోజంతా ఉంటా.. ఎన్ని కోట్లు అడిగినా నిధులు ఇస్తానని తెలిపారు.. కొడంగల్ అభివృద్ధి బాధ్యత తనది అని సీఎం కేసీఆర్ అన్నారు. ఏడాది లోపల పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీరు అందుతదని చెప్పారు.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్‌కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్‌లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!