Rajesh Veeramalla
Author- NTV Telugu-
Revanth Reddy: తొలి ఉద్యోగం ఆ యువతికే.. సంతకం చేయనున్న రేవంత్ రెడ్డి..!
తెలంగాణ రాష్ట్ర సీఎంగా రేపు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఎల్బీ స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డి తొలి సంతకం దేనిపై చేస్తాడు అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో.. పార్టీ మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ మీద తొలి సంతకం చేయాలని నిర్ణయించారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రజినీ అనే మరుగుజ్జు అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ… -
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో లోయలో పడ్డ ట్యాక్సీ.. ఐదుగురు పర్యాటకులు మృతి
జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గందర్‌బాల్ జిల్లాలోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై వెళ్తుండగా.. ట్యాక్సీ లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన వారు కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. -
David Warner: చెన్నైపై మిచౌంగ్ తుపాన్ విధ్వంసం.. డేవిడ్ వార్నర్ పోస్ట్
మిచౌంగ్ తుపాన్ తో చెన్నై అతలాకుతలం అవుతుంది. భారీ వర్షాల ధాటికి నగరంలో వరదలు ముంచెత్తాయి. అంతేకాకుండా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ క్రమంలో జనాలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో చెన్నై వాసులకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చేయూత అందిస్తున్నారు. తాజాగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా చెన్నై వాసులకు మద్దతుగా నిలబడ్డాడు. -
Utter Pradesh: యూపీలో ఘోరం.. బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపు చూసేందుకు వెళ్లిన అమాయక బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక ముఖం, ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. -
Geetika Koul: తొలిసారిగా సియాచిన్లోని భారత సైన్యానికి మహిళా డాక్టర్ ఎంపిక
భారత సైన్యానికి చెందిన మొదటి మహిళా కెప్టెన్ డాక్టర్ గీతిక కౌల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సియాచిన్ లోని భారత సైన్యానికి చెందిన తొలి మహిళా మెడికల్ ఆఫీసర్ గా ఎంపికయ్యారు. స్నో లెపార్డ్ దళానికి చెందిన గీతికా కౌల్ రికార్డులకెక్కారు. అక్కడ యుద్ధ పాఠశాలలో కౌల్ కఠినమైన ఇండక్షన్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసింది. -
Uttar Pradesh: దొంగతనం చేశాడని యువకుడిని స్తంభానికి కట్టి కొట్టిన స్థానికులు
ఉత్తర ప్రదేశ్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని పోష్ కాలనీలో.. ఓ యువకుడిని స్థానికులు స్తంభానికి కట్టి దారుణంగా కొట్టారు. దొంగతనం చేశాడనే ఆరోపణలపై కర్రలతో చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే.. అయితే బాధితుడిని కొట్టిన వ్యక్తుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
Assembly Sessions: మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. పటిష్ట భద్రత ఏర్పాటు
మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 7 నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో భద్రత కోసం 11,000 మంది పోలీసులు, 40 బాంబ్ స్క్వాడ్‌లు, 10 కంపెనీల స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF), ఇతర భద్రతా దళాలు మోహరించనున్నారు. 14 రోజుల పాటు జరిగే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నాయి. -
Smriti Irani: భారత్‌లో సౌదీ అరేబియా మంత్రి పర్యటన.. హజ్ యాత్రపై స్మృతి ఇరానీ చర్చ
సౌదీ అరేబియా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజన్ అల్-రబియా భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఈరోజు భారత కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్-రబియాను కలిశారు. ఈ క్రమంలో స్మృతి ఇరానీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకోవడం గురించి మాట్లాడామన్నారు. అంతేకాకుండా.. హజ్ యాత్రను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై కూడా చర్చించామని తెలిపారు. -
Redmi 13C 5G: మార్కెట్లోకి రెడ్ మీ స్మార్ట్ ఫోన్.. రేపే లాంచ్..!
రెడ్ మీ స్మార్ట్ ఫోన్కు సంబంధించి లాంచింగ్ రేపు (డిసెంబర్ 6న) జరగబోతోంది. అందుకోసం పెద్ద ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో రెడ్ మీ 13C 4G, 5G మోడల్‌లను లాంచ్ చేయనున్నారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు వర్చువల్ ఈవెంట్‌లో ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఈవెంట్ ను చూడటానికి రెడ్‌మీ ఇండియా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో చూడవచ్చు. -
Shivraj Singh Chauhan: నేనెప్పుడూ సీఎం రేసులో లేను.. శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు.
తాజావార్తలు
-
Tarique Rahman: బ్రిక్స్‌కు దూరం.. యూఎన్ భేటీకి న్యూయార్క్ వెళ్తున్న తారిఖ్ రెహమాన్
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?