Toxic Effect: యశ్ ‘టాక్సిక్’ ఎఫెక్ట్.. శ్రద్ధా కపూర్ సినిమాకూ రిలీజ్ డేట్ మార్పు తప్పదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Effect: రాకింగ్ స్టార్ యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ విడుదలకు సిద్ధమవుతుండగా, అదే తేదీకి షెడ్యూల్ అయిన కొన్ని బాలీవుడ్ చిత్రాలు తమ రిలీజ్ డేట్ లను మార్చుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా భాటియా నటిస్తున్న ‘ది వ్వాన్’ వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు శ్రద్ధా కపూర్ నటిస్తున్న ‘ఈత’ కూడా అదే బాటలో నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సమాచారం ప్రకారం, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఈత’ చిత్రాన్ని మొదట 2026 ఆగస్టు 28న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. అయితే అదే రోజున విడుదల కానున్న ‘టాక్సిక్’తో నేరుగా పోటీ పడడం వల్ల బాక్సాఫీస్ వద్ద స్క్రీన్ల షేరింగ్ ప్రభావం పడే అవకాశం ఉందని చిత్ర నిర్మాణ సంస్థ మ్యాడాక్ ఫిల్మ్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్ చిత్రాలు ఒకే రోజు వస్తే థియేటర్ల కేటాయింపు, వసూళ్లపై ప్రభావం తప్పదనే అంచనాతో చిత్రాన్ని ముందుగానో లేదా తర్వాతనో విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కూడా ఉంది.
‘ఈత’ చిత్రానికి ‘ఛావా’ ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. మరాఠీ ఫేమస్ కళాకారిణి వితాబాయి నారాయణంగావ్కర్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ బయోపిక్ రూపొందుతోంది. శ్రద్ధా కపూర్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా, రణదీప్ హుడా, మొహమ్మద్ జీషన్ అయ్యూబ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. అయితే రిలీజ్ డేట్ మాత్రమే కాదు, సినిమా టైటిల్ కూడా ప్రస్తుతం వివాదంలో చిక్కుకుంది. ‘ఈత’ అనే పేరుపై ఎన్సీపీ నేతలు, అలాగే వితాబాయి నారాయణంగావ్కర్ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. సినిమా పేరును మార్చాలని వారు కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చిత్ర బృందం ఒకవైపు విడుదల తేదీపై, మరోవైపు టైటిల్ వివాదంపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Age Gap Stories : ఏజ్ గ్యాప్ లవ్‌స్టోరీలకు కేరాఫ్ అడ్రస్‌గా యంగ్ హీరో.. ఏకంగా నాలుగు హిట్స్
- Nana Patekar Dies: బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. గోవా నివాసంలో అపస్మారక స్థితిలో..!
- NBK DADA : సెట్స్‌లో అడుగుపెట్టిన సింహం.. క్రిస్ట'మాస్' చూపించబోతున్నారు
మరోవైపు యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు సృష్టిస్తోంది. దీర్ఘకాలంగా వాయిదా పడిన ఈ చిత్రం విడుదలకు దగ్గరపడుతుండటంతో థియేటర్ యజమానులు, పంపిణీదారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రద్ధా కపూర్ ‘ఈత’ కొత్త విడుదల తేదీ ఏమిటి? మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అన్నది ఇప్పుడు బాలీవుడ్లో ఆసక్తికర చర్చగా మారింది. ‘టాక్సిక్’ ఎఫ్ఫెక్ట్ తో ఇంకెన్ని సినిమాలు వాయిదా వేసుకుంటాయో చూడాలి మరి.
- Tags
- cinema
- Shraddha kapoor
- Toxic
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!