ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపు చూసేందుకు వెళ్లిన అమాయక బాలికపై గుర్తు తెలియని యువకుడు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో బాలిక ముఖం, ప్రైవేట్ భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.
Read Also: Congress Cabinet: తెలంగాణలో కొత్త మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నజర్..
వివరాల్లోకి వెళ్తే.. ఏడేళ్ల బాలిక ఇంటి పక్కన పెళ్లి ఊరేగింపు చూసేందుకు వెళ్లి అకస్మాత్తుగా అదృశ్యమైందని కుటుంబీకులు చెబుతున్నారు. బాలిక కోసం వెతకగా.. రక్తంతో తడిసిన స్థితిలో పడి ఉందని తెలిపారు. అంతేకాకుండా.. ఆమె ముఖం, ప్రైవేట్ భాగాలలో రక్తస్రావం కనిపించిందని కుటుంబీకులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బాలిక పరిస్థితి విషమించడంతో కౌశాంబి జిల్లాలోని భర్వారీ ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం బాలికను మంజన్‌పూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Read Also: Chitra Shukla: పెళ్లి పీటలు ఎక్కుతున్న రాజ్ తరుణ్ హీరోయిన్
ఈ ఘటనతో బాధిత కుటుంబం షాక్‌కు గురైంది. నిందితుడిని త్వరగా అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక పరిస్థితి కొద్దికొద్దిగా మెరుగు పడుతుంది. ఇదిలా ఉంటే.. ఈ కేసులో గుర్తు తెలియని యువకుడిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఘటనను త్వరగా ఛేదించేందుకు ఎస్పీ మూడు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు.