YS Jagan: ఆక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. సిండికేట్‌ను కూకటివేళ్లతో పెకలిస్తా!
- భీమవరంలో ఆక్వా రైతులతో వైఎస్ జగన్ ముఖాముఖి
- ఆక్వా రైతాంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది
- ఆక్వా రంగం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భీమవరంలో ఆక్వా రైతులతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతులు భారీ నష్టాలు చవిచూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ఆక్వా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని జగన్ విమర్శించారు.
‘ఆక్వా రైతులు ఉపయోగించే ఫీడ్ ధరలను కంపెనీలు ఇష్టానుసారంగా పెంచుతున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఏకపక్షంగా ధరలు పెంచకుండా రెగ్యులేటరీ బోర్డు ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేశాము. ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ చట్టాన్ని నిర్వీర్యం చేసింది. కేవలం నాలుగు నెలల్లోనే ఫీడ్ ధరలను కిలోకు రూ.14 నుంచి రూ.16 వరకు పెంచారు. ఆక్వా సాగులో మొత్తం ఖర్చులో దాదాపు 60 శాతం ఫీడ్‌కే వెచ్చించాల్సి ఉంటుంది. మినరల్ మిక్సర్ ధరలు పెరిగాయని పెంచుతున్నారు. మరి ధరలు తగ్గినప్పుడు మాత్రం కంపెనీలు తగ్గించడం లేదు ఎందుకు’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Also Read
‘రైతుల సమస్యలు కేవలం ఆక్వా రంగానికే పరిమితం కాలేదు. వరుసగా రెండేళ్లుగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో ఏ పంటకూ సరైన ధర దక్కడం లేదు. రైతు భరోసా పథకం కూడా ఇప్పుడు ఒక మోసంలా కనిపిస్తోంది. రైతుల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న పాలకులు ఉంటేనే వారి పరిస్థితి మెరుగుపడుతుంది. మా ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నాము. రాష్ట్ర వ్యవసాయ, ఆక్వా ఎగుమతులను రూ.23 వేల కోట్లకు పెంచాం. రైతాంగానికి అండగా నిలవడం వల్లే రాష్ట్రానికి బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు దక్కింది. నర్సాపురంలో ఫిషరీస్ యూనివర్సిటీ ప్రారంభిస్తే ప్రస్తుత ప్రభుత్వం మూసివేసింది. మెడికల్ కాలేజీల నిర్మాణాలను కూడా నిలిపివేసింది. 120 రోజుల పాటు పెరగాల్సిన ఆక్వా సీడ్ ప్రస్తుతం 90 రోజులు కూడా నిలవడం లేదు’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖాముఖి సందర్భంగా రైతులకు మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. ‘మీ కష్టాలు నాకు తెలుసు.. నేను మీతోనే ఉన్నాను’ అంటూ రైతులకు ధైర్యం చెప్పారు. మరో మూడేళ్లలో రైతు అనుకూల ప్రభుత్వం తిరిగి వస్తుందని, అప్పటివరకు ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఆక్వా రంగాన్ని దెబ్బతీస్తున్న సిండికేట్ వ్యవస్థను కూకటివేళ్లతో పెకలిస్తామని, రైతుల హక్కుల కోసం ఉద్యమబాట పట్టేందుకు వైసీపీ ఎప్పుడూ ముందుంటుందని జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
- Tags
- ap
- aqua farmers
- Bhimavaram
- ycp
- ys jagan
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!