మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానెప్పుడూ సీఎం రేసులో లేనని తెలిపారు. బీజేపీ కార్యకర్త కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా దాన్ని విధిగా నిర్వహిస్తానని తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్‌లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజు పెరిగింది. ఉదయం స్వల్పంగా లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత భారీగా పుంజుకున్నాయి. ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ కొత్త గరిష్ఠాలను తాకింది. సెన్సెక్స్ 431.02 పాయింట్లు పెరిగి 69,296.14 పాయింట్ల కొత్త రికార్డుకు చేరుకోగా.. నిఫ్టీ కూడా 168.50 పాయింట్లు పెరిగి 20,855.30 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ…
మంగళవారం తమిళనాడులోని చెన్నైలో మిచాంగ్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు పడవలు, ట్రాక్టర్లను ఉపయోగించారు. మంగళవారం ఉదయం నుండి చెన్నైలోని చాలా ప్రాంతాల్లో వర్షం ప్రభావం తక్కువగానే ఉంది. దీంతో రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలను అధికారులు వేగవంతం చేశారు. ఇదిలా ఉంటే.. చెన్నై, ఇతర ప్రాంతాలలో వరదల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది గాయపడగా.. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
లాల్దుహోమా నాయకత్వంలోని ZPM (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) మిజోరంలో విజయం సాధించింది. 40 అసెంబ్లీ స్థానాల్లో 27 స్థానాలను గెలుచుకుంది. ఈ క్రమంలో అధికార MNF (మిజో నేషనల్ ఫ్రంట్)ను అధికారం నుండి తొలగించి.. జడ్పీఎం అధికారం చేపట్టనుంది. కాగా.. మిజోరాం నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి లాల్దుహోమ ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
చండీగఢ్లోని అమృత్‌సర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది లఖ్‌బీర్ సింగ్ రోడ్ సహచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇండియాలోని 'మోస్ట్ వాంటెడ్' నేరస్థులలో ఒకరైన జర్నైల్ సింగ్ భింద్రన్‌వాలే మేనల్లుడు రోడ్.. కాగా లఖ్‌బీర్ సింగ్ పాకిస్తాన్‌లో గుండెపోటుతో మరణించాడు. అతని సహచరుడు పరమజీత్ సింగ్ అలియాస్ ధాదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను ఉగ్రవాద కార్యకలాపాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడా కార్యకలాపాలకు అద్భుతమైన వాతావరణం ఏర్పడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు.
మునపటి పోలిస్తే 2022 సంవత్సరంలో ఢిల్లీలో 3.3 శాతం క్రిమినల్ కేసులు పెరిగాయి. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం.. గతేడాది ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 2022లో దేశ రాజధానిలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) కింద మొత్తం 2,98,988 కేసులు నమోదు కాగా.. 2021లో 2,89,045 కేసులు నమోదయ్యాయి.
కర్నాటకలోని బెళగావి జయనగర్‌లో బీజేపీ నేత పృథ్వీ సింగ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ చన్నరాజ్ హత్తిహోళి కత్తితో దాడి చేశారు. ఆయన నివాసానికి సమీపంలోనే ఘటనకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పృథ్వీ సింగ్ చేతులు, వీపుపై గాయాలయ్యాయి. దీంతో అతన్ని బెలగావిలోని కేఎల్‌ఈ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముంబైలో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ టీచర్. ఆంటోప్ హిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సియోన్ కోలివాడ ప్రాంతంలో ఉన్న కోచింగ్ సెంటర్‌లో 16 ఏళ్ల విద్యార్థిని కోచింగ్ తీసుకుంటుంది. ఈ క్రమంలో వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో.. బాధితురాలి కుటుంబసభ్యుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డిసెంబర్ 2న బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను.. డిసెంబర్ 5 అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాన్ని తాకనుంది. దీంతో.. ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరిలలో తుపాను ప్రభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అంతేకాకుండా.. గాలులు గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. ఇప్పటికే.. చెన్నైలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొనగా.. ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం తెలుస్తోంది.