ఆవులు, గేదెల పెంపకం ద్వారా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్న రైతులను మీరు చూసి ఉంటారు. అయితే అంతకుమించి డబ్బులు సంపాదిస్తున్నాడు ఓ రైతు. కానీ అది ఆవులు, గేదెల పెంపకంతో కాదు.. గాడిదల పెంపకంతో. గాడిదలను వస్తువులను తీసుకెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటి పెంపకం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చు. ఎందుకంటే గాడిద పాలకు ప్రపంచంలో అత్యంత ఖరీదు ఉంది.
తెలంగాణ మినహాయిస్తే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ క్రమంలో సోనియా గాంధీ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. జనపథ్ నివాసంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ భేటీలో మూడు రాష్ట్రాల్లో పేలవమైన పనితీరుపై చర్చిస్తున్నారు. అంతేకాకుండా.. పార్లమెంట్‌లో కాంగ్రెస్ వ్యూహంపై చర్చ, తెలంగాణలో సీఎంను ఎంపిక చేసే అంశంపై చర్చించే అవకాశముంది.
నిన్న వెల్లడైన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందింది. 115 సీట్లు గెలుచుకుని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో.. జైపూర్‌లోని హవా మహల్ సీటును గెలుచుకున్న బీజేపీ ఎమ్మెల్యే బల్ముకుంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ప్రాంతంలోని వీధుల్లోని అన్ని నాన్ వెజ్ ఫుడ్ స్టాల్స్‌ను మూసివేయాలని ఆదేశించారు.
మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జోరం పీపుల్స్ మూవ్‌మెంట్) ఘనవిజయం సాధించింది. ఈసారి అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పీఎం), కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని అందరు భావించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార మిజో నేషనల్ ఫ్రంట్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 40 సీట్లున్న అసెంబ్లీలో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ (జెడ్‌పిఎం) 27 సీట్లను గెలుచుకుంది.
మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్ మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు పొడిగించింది. డిసెంబర్ 11వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఈడీ విచారిస్తున్న ఈ కేసులో.. ఢిల్లీ హైకోర్టు తన బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గుడిసెలకు నిప్పంటుకుని అందులో ఉన్న ముగ్గురు చిన్నారులు మృత్యువాత చెందారు. ఈ ఘటన జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాదిత్ గ్రామంలో జరిగింది. శనివారం అర్థరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఆదివారం హత్యా ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితుడు మాత్రం ఏ మాత్రం భయం, బెరుకు లేకండా బాధితుడిపై దాడికి దిగాడు. కాగా.. కొడవలితో దాడి చేస్తున్నప్పుడు స్థానికులు ఆపకుండా, ఫోన్లలో ఈ దాడిని మొత్తం వీడియో తీశారు.
నిన్న వెలువడిన 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించగా, కేవలం ఒక్కచోట మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మాట్లాడుతూ.. మూడు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం పంచుకోని కారణంగా కాంగ్రెస్ ఓడిపోయిందని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ ఓటమి మాత్రమేనని.. ప్రజలది కాదు అని తెలిపారు.
తెలంగాణతో తమ బంధం విడదీయరానిది.. రాష్ట్ర ప్రజల కోసం బీజేపీ పని చేస్తూనే ఉంటుందని ప్రధాని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలిచిందని అన్నారు. కాగా.. బీజేపీ మూడో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ ప్రాబల్యం పెరుగుతోందని, దానిని మరింతగా పెంచేందుకు కృషి చేస్తూనే ఉంటామని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.