తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో.. సెక్రటేరియట్ వద్ద తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, ఉద్యోగులు విజయోత్సవాల్లో పాల్గొన్నారు. సచివాలయం వద్ద బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని తెలిపారు.
Revanth Reddy: తొలి ఉద్యోగం ఆ యువతికే.. సంతకం చేయనున్న రేవంత్ రెడ్డి..!
ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను హరించారని కోదండరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటానని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. ఇక నుంచి వాట్సాప్ కాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు ఉన్నంత సంతోషం ఇవాళ ఉంది.. రాక్షసుని పాలన పోయిందని కోదండరాం తెలిపారు.