తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం ఇచ్చాడు. రజినీకి ఉద్యోగం ఇస్తూ ఫైల్ పై సంతకం చేశారు. అంతేకాకుండా.. ప్రమాణస్వీకార వేదిక మీదనే రజినీకి నియామక పత్రాన్ని అందించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాగా.. దివ్యాంగురాలు రజినీకి అగ్రికల్చర్ కార్పోరేషన్ లో కాంట్రాక్ట్…
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు అని తెలిపారు. అంతేకాకుండా.. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు చెప్పారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. రూ.8 కోట్ల బకాయిలు చెల్లించని కారణంగా ఏ క్షణమైనా సీజ్ చేస్తామని మాల్ ఎదుట మైక్ లో అనౌన్స్ చేశారు అధికారులు. దీంతో.. షాపింగ్ కాంప్లెక్స్ లో ఉన్న వ్యాపారస్తులకు ఖాళీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో.. మాల్ వ్యాపారంలో అయోమయంలో ఉన్నారు. మరోవైపు.. మాల్ ను స్వాధీనం చేసుకునేందుకు ఆర్టీసీ అధికారులు సిద్దమవుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ మీటింగ్ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయానికి చేరుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ తొలిసారి సచివాలయానికి వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు కూడా సచివాలయానికి వచ్చారు. ఇదిలా ఉంటే.. సీఎం ముఖ్య కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. అదే విధంగా.. తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బి.శివధర్‌రెడ్డి నియమిస్తూ.. సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎల్బీస్టేడియం నుంచి సీఎం రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరి వెళ్లారు. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంకు చేరుకోనున్నారు. సీఎం రాక కోసం సెక్రటేరియట్ ను అందంగా ముస్తాబు చేశారు. అంతేకాకుండా.. కొత్త సీఎం రాక కోసం సెక్రటేరియట్ లో ఉద్యోగులు, బ్యూరోక్రాట్స్ ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉంటే.. సీఎం రేవంత్ రెడ్డికి సచివాలయ అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు.
తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. అంతేకాకుండా.. రాష్ట్రం నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. ఈ క్రమంలో.. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి పలువురు నేతలు అభినందనలు తెలుపుతున్నారు.
ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు శీతాకాల సెలవులు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని ఢిల్లీ ప్రభుత్వ విద్యా శాఖ బుధవారం తెలిపింది. సాధారణంగా, ప్రాథమిక పాఠశాల పిల్లలకు శీతాకాల సెలవులు డిసెంబర్ 25 నుండి జనవరి 15 వరకు, ప్రాథమిక తరగతులకు శీతాకాల సెలవులు జనవరి 1 నుండి 15 వరకు ఉంటాయి. ఈసారి శీతాకాల సెలవులను 10 నుంచి 15 రోజులు తగ్గించారు.
తల్లి తర్వాత విలువైన సంబంధం కలిగి ఉండేది తండ్రికే. కూతురు-తండ్రి మధ్య బంధం అంటే ఎంతో బలంగా ఉంటుంది. కూతురికి తండ్రి అంటే గొప్ప నమ్మకం, ధైర్యం. కానీ అలాంటి తండ్రే ఓ కూతురి పట్ల కామ మృగాడిలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కూతురిపై అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా.. తాను అత్యాచారానికి పాల్పడ్డ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని.. చెప్తే చంపేస్తానని కూతురిని బెదిరించాడు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్న అనంతరం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు.. బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని తెలిపారు. కేసీఆర్ సింహాలా బయటకు వస్తారని.. సమయం చెప్పలేమని అన్నారు.
వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి లెజెండరీ క్రికెట్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ హాజరుకానున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి ఆహ్వానం పంపించినట్లు తెలుస్తోంది. 2024 జనవరి 22న శ్రీరాముడితో పాటూ ఇతర దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతున్నారు. ఆయనతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.