Minister Konda Surekha: హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ప్రజావాణికి వచ్చిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని, వారి అర్జీలను తీసుకున్నామని తెలిపారు. ప్రతి అర్జికి ఒక నంబర్ ను కేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే అర్జిదారుల రిఫరెన్స్ కొరకు వారి సెల్ ఫోన్ నంబర్ కు సంక్షిప్త సందేశం పంపుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Read Also: TS Govt: 2024 సంవత్సరానికి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
ప్రజావాణి నిర్వహణను జలమండలి ఎం.డీ దాన కిషోర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ, ఆయుష్ డైరెక్టర్ హరిచందన, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read Also: Harish Rao: ప్రభుత్వం ఏర్పడలేదని కుంగిపోవాల్సిన అవసరం లేదు..