మంత్రిగా తొలిసారి కరీంనగర్ వచ్చిన పొన్నం ప్రభాకర్ కి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అల్గునుర్ చౌరస్తా నుంచి తెలంగాణ చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. స్వాగత సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రసంగిస్తూ.. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే.. నేను మంత్రిని అయినా కరీంనగర్ బిడ్డనే.. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన సాధారణ వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఎంపీని చేసింది, మంత్రిని చేసిందన్నారు. చొక్కారావు శిష్యుణ్ణి మంత్రిని చేసింది కరీంనగర్…
రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో.. అలుగునుర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మేల్యేలు కవ్వంపల్లి సత్యనారయణ, మేడిపల్లి సత్యంకు భారీ గజమాలతో కాంగ్రెస్ నాయకులు, ప్రజలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తదనంతరం పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలిపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నియోజవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల కృతజ్ఞత సభ, ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన వారు తరువాత ఎన్నికలలో ఓడిపోతారనే పుకారు ఉండేది.. గతంలో స్పీకర్లుగా పనిచేసిన వారు అందరూ ఓడిపోయారు.. కానీ బాన్సువాడ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో చరిత్ర తిరగరాసానని పోచారం తెలిపారు. తెలంగాణ శాసనసభలో అత్యంత ఎక్కువ వయస్సు సభ్యుడిని…
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ధరణిపై నిర్వహించిన సమీక్ష కాసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ రూప కల్పన ఎవరికి ఇచ్చారు. టెండర్ పిలిచారా? ఏ ప్రాతిపదికన వెబ్సైట్ క్రియేట్ చేసేందుకు అవకాశం ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18లక్షల 46వేల 416 మందికి ఇంకా పాస్ బుక్స్ ఇవ్వలేదని పేర్కొన్నారు.
ముంబైలో ఓ పోలీసు అధికారి మహిళతో కలిసి డ్యాన్స్ చేసిన ఘటన వివాదానికి దారితీసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో.. ముంబై లోకల్ ట్రైన్‌లోని సెకండ్ క్లాస్ లేడీస్ కోచ్‌లో ఓ యువతితో కలిసి డ్యాన్స్ చేసినట్లు వీడియోలో ఉంది. ఈ ఘటన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుండగా SF గుప్తా అనే పోలీసు అధికారిని పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నారు. ఈ ఘటన డిసెంబరు 6న రాత్రి 10:00 గంటల నుంచి 10:15 గంటల మధ్య…
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను అనుగుణంగా ప్రస్తుత పోటీని తట్టుకునేలా సాంకేతికతను అందిపుచ్చుకుని అన్నదాతలకు ఉపయోగపడేలా కార్పొరేషన్లు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు సచివాలయంలో వ్యవసాయ అనుబంధ శాఖలపై తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యయసాయ 14 కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కార్పొరేషన్లు విజయవంతంగా రైతులకు సేవలు అందించేందుకు అవసరమైన పద్దతులను అవలంభించాలన్నారు. పంటల సాగులో ఇతర దేశాలు అనుసరిస్తున్న అత్యాధునిక విధానాలను మనం అలవరుచుకోవాల్సిన…
సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధరణిపై సమీక్ష ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా పాల్గొన్నారు. సుమారు 2 గంటల పాటు ధరణిపై సమీక్షించారు. ఈ క్రమంలో.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే.. నెలకు ఒకసారి మండల కేంద్రంలో రెవిన్యూ సదస్సులు నిర్వహించాలని చర్చించినట్లు సమాచారం. కాగా.. ఎన్నికల్లో ధరణి రద్దు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆటో డ్రైవర్లు ధర్నా చేపట్టారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు రాస్తారోకో చేశారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో.. అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికకు ఇవాళ నామినేషన్లు స్వీకరించారు. నామినేషన్లకు సంబంధించి గడువు కొద్దిసేపటి క్రితమే ముగిసింది. అందులో ఒకే ఒక నామినేషన్ దాఖలు అయింది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాగా.. రేపు అసెంబ్లీలో స్పీకర్ ఎన్నికను అధికారికంగా ప్రొటెం స్పీకర్ ప్రకటించనున్నారు.
రాచకొండ పోలీసు కమిషనర్ గా జి. సుధీర్ బాబును ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. సీపీడీఎస్ చౌహన్‌ను డీజీపీ కార్యాలయానికి బదిలీ చేశారు. ప్రస్తుతం సుధీర్ బాబు.. హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. తన మీద నమ్మకంతో బాధ్యత ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదములు తెలిపారు. మూడు కమిషనరేట్స్ కో ఆర్డినేషన్ తో కలిసి పనిచేస్తాం.. ప్రజలకు ఎల్లవేళలా సేవలందిస్తామని అన్నారు. ప్రజా సమస్యలు త్వరగా…