తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా సాగాయి. ఈ క్రమంలో.. మళ్లీ ఈ నెల 20వ తేదీ(బుధవారం)కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య తీవ్ర వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ వైఫల్యాలపై ముఖ్యమంత్రి విరుచుకుపడగా.. అటు ప్రతిపక్ష నేత కేటీఆర్ ధీటుగా సమాధానమిచ్చారు.
Read Also: Goreti Venkanna: మండలిలో గోరటి వెంకన్న సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విరుచుకుపడ్డారు. 50ఏళ్ల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం తప్ప.. ఏముంది చెప్పుకోవడానికి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో విధ్వంసం, రాచరిక పోకడలు అవలంభించారని మండిపడ్డారు. ఇలా శనివారం అసెంబ్లీ హాట్ హాట్ గా కొనసాగింది. ఇదిలా ఉంటే.. ఈ నెల 20వ తేదీ నుంచి జరిగే సమావేశాల్లో కేసీఆర్ పాల్గొంటారా? అని బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది.
Read Also: Kuwait: కువైట్ రాజు షేక్ నవాఫ్ కన్నుమూత.. కొత్త పాలకుడిగా షేక్ మిషాల్..