శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇందిరమ్మ రాజ్యం కోసం తమ ప్రయత్నం కొనసాగుతుందన్నారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం పాలన కొనసాగిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు అన్యాయం జరిగిన ప్రతిసారి ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది.. మేము ప్రజాస్వామిక పాలన అందిస్తామని సీఎం పేర్కొన్నారు. అంతేకాకుండా.. అందరికీ నిరసనలు తెలుపుకోవడానికి అవకాశం కల్పిస్తామన్నారు.
Bigg Boss Telugu 7 Finale: ఊహించని లక్ తో లక్షలు కొల్లగొట్టిన యావర్.. జస్ట్ లో మిస్ అయ్యేవాడే!
అన్ని సభలలో తనకు అనుభవం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో జరిగిన తప్పును మేము సరిదిద్దాము.. అందుకే గతంలో ప్రగతి భవన్ ముందు ఉంచిన ముల్లె కంచెను తొలగించామని తెలిపారు. పాలనపరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలని అనుకున్న వారు ఎవరైనా వచ్చి సలహాలు ఇవ్వండి అని కోరారు. గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బీమాలు చూస్తే అర్థం అవుతుంది… ఎంత మంది యువ రైతులు చనిపోయారో అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో కల్పించుకుని మండలి చైర్మన్ గుత్తా క్లారిటీ ఇచ్చారు.
Kajal Agarwal : చీరకట్టులో మెరిసిన కాజల్.. వైరల్ అవుతున్న పిక్స్..