ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ టెస్టు కెరీర్ శనివారం (జనవరి 6)తో ముగిసింది. ఇటీవలే టెస్ట్ లకు, వన్డేలకు రిటైర్మెంట్ ఇచ్చిన వార్నర్.. తన కెరీర్ లో నేడు చివరి టెస్ట్ ఆడాడు. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్ మధ్య మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో వైట్‌వాష్ చేసింది. అంతేకాకుండా.. వార్నర్ కు ఆసీస్ జట్టు గెలుపుతో మంచి గిఫ్ట్ ఇచ్చింది.
చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీపై టీడీపీకి సంబంధించిన మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అన్నారు.. ఎస్సీలకే కాదు.. ఎస్టీలకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామ రామారావు చావుకు చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. చంద్రబాబుకు భూదాహం ధనదాహం ఎక్కువ.. కానీ పేదలపై ప్రేమ లేదని నారాయణ స్వామి ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 4 ఏళ్ల 9నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంత్రత్వం, అవినీతి, అబద్ధాలమయమని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని అన్నారు. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్ లేదని కనకమేడల తెలిపారు.
కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు, జూపూడి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. చాలా మంది బ్లడ్ రిలేషన్ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, కొందరు కొత్త వాళ్ళు జగన్ ను దించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.
తనకు వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. 'నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి. ఇది అసత్యం... ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడంతో కాస్తా డీ హైడ్రేషన్ కి గురి అయ్యానని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉన్నానని.. సోమవారం నుండి యథావిధిగా ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పరామర్శల…
కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలా? కుటుంబమా అన్న ప్రశ్న వస్తే మా ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలేనని తెలిపారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.. ఫలితం ఏమయ్యిందని అన్నారు. కాగా.. జగన్ కుటుంబం కోసం పార్టీ పెట్టలేదని తెలిపారు.…
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఆ రెండు జిల్లాల్లో 'రా కదలిరా' సభలకు హాజరుకానున్నారు. తిరువూరులో అయ్యప్పస్వామి ఆలయం వద్ద, ఆచంటలో ఆచంట-మార్టేరు రోడ్ వద్ద ఈ సభలు జరగనున్నాయి.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. అంతేకాకుండా.. క్యాడర్ ను అప్రమత్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరీ ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.. ఆమే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చేసి వాడుకుంటున్నారని, కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలు ప్రచారం చేసుకుంటున్నారని పురందేశ్వరీ అన్నారు.
జనవరి 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న సంగతి తెలిసిందే. అందుకు సంబంధించి పలువురు ప్రముఖులకు ఆహ్వానం పంపించింది ఆలయ కమిటి. అయితే ఈ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని తెలిపారు శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ ఠాక్రే. అయితే ఆరోజుకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే ఏమి చేయబోతున్నారో తన ప్రణాళికను చెప్పారు. ఆ రోజు నాసిక్‌లోని కాలారం ఆలయాన్ని తాను, తన పార్టీ నేతలు సందర్శించి గోదావరి నది ఒడ్డున మహా హారతి చేస్తారని ఉద్ధవ్ చెప్పారు.