తిరువూరులో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో భాగంగా.. సభలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై చర్చ జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలను పేరుపేరునా చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. కానీ.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృషప్రసాద్ ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఏ విమర్శలు చేయకుండా చంద్రబాబు స్కిప్ చేశారు.
విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఝాన్సీ పోటీ విషయం ప్రస్తుతానికి అప్రస్తుతం అని అన్నారు. తనకు ఎటువంటి సమాచారం లేదు.. అధిష్టానం ఆలోచనల ఆధారంగా నిర్ణయం ఉంటుందని మంత్రి బొత్స తెలిపారు.
గుంటూరు జిల్లాలో టీడీపీ-జనసేన మధ్య పొత్తుల వ్యవహారం క్షేత్రస్థాయిలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని కలిసిపోయామని చెప్పిన నాయకులు.. ఇప్పుడు ఎవరికి వారే ప్రత్యేక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. సీటు తమకే వస్తుందని జనసేన-టీడీపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజాలు సీటు కోసం పోటీపడుతున్నారు. దీంతో రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
విజయవాడలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్, పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్ షేక్ ఆసిఫ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని తెలియజేసేలా స్మృతివనం ఉండబోతోందని తెలిపారు. విజయవాడ నగరం గతంలో ఎలా ఉంది.. ఇప్పుడెలా ఉందో…
విజయవాడ కేంద్రంగా అరసవిల్లి అరవింద్ సారథ్యంలో చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్నారు. ఈ ట్రస్ట్లో కోవిడ్ సమయంలో చికిత్సలు, అన్న దానాలు, మెడికల్ సేవలు, మంచి నీటి పథకాలు లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కాగా.. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నందుగల మందడం గ్రామంలో శిథిలావస్థకు చేరుకున్న ప్రాథమిక పాఠశాల భవనంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని.. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన పాఠశాల భవనాన్ని నిర్మించారు. ఆ భవనాన్ని నిన్న బాపట్ల ఎంపీ, లోక్ సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ నందిగం సురేష్…
ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రాంతంలో గో సంపదను సంరక్షించాలన్న సంకల్పంతో మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి చేసిన కృషి ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురానికి గోశాలను కేటాయించారు. లక్ష్మీ చెన్నకేశవ గోశాల కమిటీ సభ్యులందరితో ఎమ్మెల్యే సంప్రదింపులు జరిపి మార్కాపురం ప్రాంతంలో గోశాల నిర్మాణం చేయడం ద్వారా అనేకమంది భక్తులకు సెంటమెంటల్ గా బాగుంటుందని తెలిపారు. అంతేకాకుండా.. వీధుల వెంట తిరుగుతున్న ఆవులు ప్రజల జీవనానికి అనేక ఇబ్బందులు కల్పిస్తున్న విషయాన్ని కూడా ఎమ్మెల్యే వారికి చెప్పారు. ఈ గోశాల కమిటీ ద్వారా…
సచివాలయంలో మున్సిపల్ కార్మికులతో జీవోఎం చర్చలు ముగిసాయి. కార్మిక సంఘాల డిమాండ్ల పై మంత్రి బొత్స, సజ్జల, అధికారులు విడిగా చర్చించారు. కనీస వేతనం 21 వేల కంటే అదనంగా మరో మూడు వేలు అయినా పెంచాలని మున్సిపల్ కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. అంతేకాకుండా.. గ్రాట్యుటీ ఇవ్వాల్సిందేనని మున్సిపల్ కార్మిక సంఘాలు కోరారు. అయితే.. జీతాలు 24 వేలు పెంచేందుకు ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో మరోసారి చర్చలు విఫలమయ్యాయి. కాగా.. సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.
టీడీపీపై రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్రం వచ్చిన నుండి ఏపీలో రెండే పోర్టులు ఉండటం బాధాకరమని అన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఎందుకు కొత్తగా ఒక్క పోర్టులకు నిర్మాణం చేయలేదని ప్రశ్నించారు. కనీసం శంఖుస్థాపన కూడా ఎందుకు చేయలేదన్నది సూటి ప్రశ్న అని అన్నారు. అభివృద్ధిపై చర్చకు రావాలని నారా లోకేష్ కి సవాల్ విసిరాను.. కానీ ఆయన రాలేదని తెలిపారు.
యాపిల్, క్యారెట్, బీట్‌రూట్ తో జ్యూస్ తయారుచేసుకుని తాగడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలోని అన్ని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో ఇది సహాయపడుతుంది. ఇది కాలేయం, మూత్రపిండాలు, ప్రేగుల నుండి వ్యర్ధాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ రసం శరీరంలోని మురికిని తొలగించి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసుకుందాం. దాని రెసిపీ కూడా తెలుసుకోండి. ఈ జ్యూస్ మన శరీర అవయవాలను డిటాక్సిఫై చేయడంలో.. రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో…
డ్రై ఫ్రూట్స్ పోషకాల భాండాగారం.. డ్రై ఫ్రూట్ ఖర్జూరంలో చాలా ప్రయోజనకరమైనవి ఉన్నాయి. రోజూ ఖర్జూరం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఖర్జూరం తింటే రుచిగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. సాధారణంగా కొందరు ఎండు ఖర్జూరాలను తింటారు.. కానీ నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఖర్జూరాలను నానబెట్టినప్పుడు, అవి మెత్తగా నమలడం సులభం అవుతుంది. అంతేకాకుండా.. నానబెట్టిన ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తింటే, శరీరం శక్తివంతంగా…