Narayanaswamy: చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీపై టీడీపీకి సంబంధించిన మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అన్నారు.. ఎస్సీలకే కాదు.. ఎస్టీలకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామ రామారావు చావుకు చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. చంద్రబాబుకు భూదాహం ధనదాహం ఎక్కువ.. కానీ పేదలపై ప్రేమ లేదని నారాయణ స్వామి ఆరోపించారు.
చంద్రబాబు బీసీలపై కపట ప్రేమ చూపారని డిప్యూటీ సీఎం మండిపడ్డారు. జగన్ అన్ని వర్గాలకూ న్యాయం చేస్తున్నారని తెలిపారు. నలుగురు బీసీలను రాజ్యసభకు పంపిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని రాజశేఖర్ రెడ్డి బతికించారని పేర్కొన్నారు. చంద్రబాబు, సోనియా కలిసి రాజశేఖర్ రెడ్డిని చంపారని నారాయణ స్వామి ఆరోపించారు. వైయస్సార్ ఫోటో పెట్టుకునే అర్హత కాంగ్రెస్ కు లేదని విమర్శించారు. మరోవైపు.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే అక్కడి ప్రజలు గ్లాసును పగుల గొట్టారని వ్యాఖ్యానించారు.
Read Also: Kanakamedala: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు..