బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో రేపటి నుంచి భవానీ దీక్షా విరమణలు ప్రారంభంకానున్నాయి. ప్రతీ ఏటా నియమ నిష్టలతో అమ్మవారిని పూజించడానికి భవానీ దీక్షను తీసుకుంటారు. మండల, అర్ధ మండల దీక్ష చేపట్టి.. తమ భవానీ దీక్ష విరమణ కోసం ఇంద్రకీలాద్రికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, ఒడిశాల నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను వైవీ సుబ్బారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. జగన్ తరపున తాను వైఎస్ షర్మిలతో మధ్యవర్తిత్వం చేసినట్లు ప్రచారం జరుగుతోంది అని అన్నారు. తాను ఎవరితోనూ మధ్యవర్తిత్వం చేయలేదని తెలిపారు. తాను మామూలుగానే అప్పుడప్పుడు విజయమ్మను కలసి కుటుంబ విషయాలపై మాట్లాడతానని చెప్పారు. నెల రోజుల తర్వాత ఆదివారం విజయమ్మను హైదరాబాద్ లో కలిశానన్నారు. కొద్దిసేపు కుటుంబ విషయాలపై విజయమ్మ, తాను మాట్లాడుకున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, హోమ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఏపీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఒక కేసులో సీజ్ చేసిన తన ఫోన్.. కోర్టు నుంచి దొంగలించి తనను పోలీసులు బెదిరిస్తున్నట్టు కోర్టులో పిటిషన్ వేశారు జనసేన నేత కిరణ్ రాయల్. ఫోన్ లో తన కుటుంబ సభ్యులను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నట్టు పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా.. రాజకీయ విమర్శలు చేయకుండా ఉండాలని పోలీసులు బెదిరిస్తున్న విషయాన్ని కోర్టుకు తెలిపారు పిటిషనర్. అంతేకాకుండా..…
మాజీమంత్రి దాడి ఫ్యామిలీ వైసీపీకి గుడ్ బై చెప్పింది. ఈ క్రమంలో.. దాడి వీరభద్రరావు రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కాగా.. వైసీపీకి రాజీనామా చేసిన వెంటనే.. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ టీడీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. రేపు చంద్రబాబుతో దాడి వీరభద్రరావు అపాయింట్ మెంట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ముద్దిగుప్పం పంచాయతీలో జగనన్న స్వేచ్ఛ ఆరోగ్య కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను డబ్బులు ఇచ్చి ఓటు అడగని వ్యక్తిని అని అన్నారు. అంతేకాకుండా.. ఎలక్షన్ లో నిలబడి ఎవరి దగ్గర తాను ఒక రూపాయి తీసుకోలేదని చెప్పారు. ఏ పోస్టు అడిగిన తాను ఫ్రీగా చేశానన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర తాను డబ్బు తీసుకోలేదని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేర్పుల వ్యవహారం హాట్ టాపిక్‌గా సాగుతోంది. సీఎంవో నుంచి నేతలకు ఫోన్‌లు వెళ్లడం.. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇలా నేతలు సీఎంవోకు క్యూ కడుతున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇంచార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో అంగన్వాడీలకు కలెక్టర్లు నోటీసులు ఇచ్చారు. గత 22 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను నిలిపివేయాలంటూ నోటీసులు జారీ చేశారు. అంగన్వాడీల ఆందోళనతో పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడుతుందని వారు తెలిపారు. గతంలో అనేక సందర్భాల్లో అంగన్వాడీల కోరికలను ప్రభుత్వం పరిష్కరించిందని అన్నారు. అంగన్వాడీల సమ్మెతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు వంటి వారికి పౌష్టికాహారం అందించేందుకు ఇబ్బందులు వస్తున్నాని చెప్పారు. ఈ క్రమంలో.. అంగన్వాడీలు జనవరి ఐదు లోపు విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ లు నోటీసులు జారీ చేశారు.…
వైసీపీకి మాజీమంత్రి దాడి ఫ్యామిలీ గుడ్ బై చెప్పింది. దాడి వీరభద్రరావు ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ పంపారు. తాను, తన అనుచరులతో కలిసి పార్టీ వీడుతున్నట్టు ఏకవాక్యంతో రాజీనామా లేఖ ముగించారు మాజీమంత్రి. అయితే.. రాజీనామా కాపీని సజ్జల, విజయసాయి రెడ్డికి పంపుతూ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేరు ప్రస్తావించారు వీరభద్రరావు.
రేపటి నుండి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా క్యూ లైన్ లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'హిట్ అండ్ రన్' వాహన చట్టాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ డీజిల్ ట్యాంకర్ డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోయింది. వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడనుంది. దీంతో ముందస్తు వాహనదారులు పెట్రోల్ బంకుల…
అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సర్‌లకు సంబంధించిన రికార్డు లేదా ప్రపంచ రికార్డు వచ్చినప్పుడల్లా.. రోహిత్ శర్మ, క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిదిలే గుర్తుకు వస్తారు. కానీ 2023లో సిక్సర్ రారాజు ఎవరో తెలుసా.. ఇప్పటి వరకు ఏ ఆటగాడు ఈ ఏడాదిలో సిక్సర్ల సెంచరీని సాధించలేకపోయాడు. UAEకి చెందిన కెప్టెన్ మహమ్మద్ వసీమ్ ఆ ఘనత సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఇయర్ లో 100 కంటే ఎక్కువ సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రికార్డలకెక్కాడు. 2023లో 47 మ్యాచ్ లు ఆడిన…