Kanakamedala: జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. 4 ఏళ్ల 9నెలల జగన్మోహన్ రెడ్డి పాలన విధ్వంసకరం, నియంత్రత్వం, అవినీతి, అబద్ధాలమయమని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు జరిగిన నష్టం కంటే, జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన నష్టమే ఎక్కువని అన్నారు. రాష్ట్రం తిరిగి కోలుకోవడానికి కనీసం 15 ఏళ్లు పడుతుంది.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప రాష్ట్రానికి, ప్రజలకు భవిష్యత్ లేదని కనకమేడల తెలిపారు.
MP Suresh: సినిమాలో తప్ప రాజకీయాలలో సక్సెస్ లేని వ్యక్తి పవన్..
Also Read
2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన ప్రభుత్వాన్ని గెలిపించి, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రానికి విముక్తి..ప్రజలకు సంతోషమని కనకమేడల అన్నారు. 99 శాతం హామీలు అమలు చేశామంటూ ప్రజల్ని మోసగించడం కాదు.. టీడీపీ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మద్యనిషేధం, సీపీఎస్ రద్దు, ప్రత్యేకహోదా, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, అంగన్ వాడీ, మున్సిపల్ కార్మికుల జీతాల పెంపు హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. జలయజ్ఞం కింద ప్రతి ఎకరాకు నీళ్లిస్తామన్నారు.. ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకు ఇచ్చారు? అని అన్నారు. పోలవరం, అమరావతి నిర్మాణాల మాటేమిటి? అని ప్రశ్నించారు.
Merugu Nagarjuna: జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చింది..
ఏటా ప్రతి రైతుకి, కౌలు రైతుకి రూ.12,500 ఆర్థిక సాయం సంగతేమిటి? ప్రశ్నించారు. నవరత్నాలు+మేనిఫెస్టో+పాదయాత్రలో ఇచ్చిన హామీల్లో జగన్ రెడ్డి అమలు చేసింది కేవలం 15శాతమే అని అన్నారు. 85 శాతం హామీల అమల్లో ఫెయిల్ అని టీడీపీ ముద్రించిన పుస్తకంలోని అంశాలపై వాస్తవాలతో శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా?అని కనకమేడల ప్రశ్నించారు. హామీల అమలుపై వాస్తవాలు వెల్లడించాకే జగన్ ప్రజల్ని ఓట్లు అడగాలని అన్నారు. సంక్షేమ రంగానికి చేసిన ఖర్చు.. మౌలిక వసతులు, రాష్ట్రాభివృద్ధికి చేసిన ఖర్చుకి సంబంధించిన వాస్తవాలు బహిర్గతం చేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, అప్పలు వివరాల తాలూకా వాస్తవాలు కూడా తక్షణమే ముఖ్యమంత్రి ప్రజల ముందు ఉంచాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!