హైదరాబాద్ రాయదుర్గంలో కిడ్నాపైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేందర్ క్షేమంగా ఉన్నాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు దగ్గర అతడిని పోలీసులు కాపాడారు. కిడ్నాప్ చేసి బంధించి కారులో తరలిస్తుండగా ఆత్మకూరు (మం) భైర్లుటీ ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అంతకుముందు.. కిడ్నాపర్లు వ్యక్తి బంధువుల నుంచి రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా.. ఎట్టకేలకు కిడ్నాపర్ల చెర నుంచి సురేంద్రను రక్షించారు పోలీసులు. రాయదుర్గం నుంచి కిడ్నాపర్లు కారులో నల్లమల అడవులకు తీసుకెళ్తుండగా.. పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు.…
ఒక జాతి సాంస్కృతిక గొంతుక భాషేనని, అందుకే అమ్మ భాష తెలుగు వ్యాప్తికి అందరూ బాధ్యత తీసుకోవాలని, మిజోరాం గవర్నర్ డా. కంభంపాటి హరిబాబు సూచించారు. తెలుగు భాష పట్ల అభిమానం పెంచుకుని వ్యాప్తి చేయడం, ప్రోత్సహించడం చేయాలన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్, చైతన్య విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో రాజమండ్రి గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న త్రిదిన అంతర్జాతీయ తెలుగు మహా సభలలో భాగంగా రెండవరోజు రాజరాజ నరేంద్ర వేదికపై నిర్వహించిన కృతజ్ఞతాంజలి సభలో ఈయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల రెండో జాబితా విడుదల అయింది. సామాజిక సమీకరణాలతో సెకండ్ లిస్ట్ రూపకల్పన జరిగింది. గెలుపే ప్రామాణికంగా సెకండ్ లిస్ట్ ను తయారు చేసింది అధిష్టానం. మొత్తం 27మందితో రెండో జాబితా విడుదల చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు కాకినాడలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. నేరుగా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం సభలో.. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
మున్సిపల్ కార్మికులతో ప్రభుత్వం చర్చలు మరోసారి విఫలమయ్యాయి. బేసిక్ పే ఇవ్వడం కుదరదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. మున్సిపల్ కార్మికులకిస్తే అన్ని డిపార్ట్మెంట్లు అడుగుతాయని మంత్రుల బృందం తెలిపింది. దీంతో మున్సిపల్ కార్మిక సంఘాలు కూడా సమ్మె విరమించేదే లేదని ఖరాకండిగా ఉన్నాయి. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని సంఘాలతో చర్చలు జరిగాయన్నారు. చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామని తెలిపారు.
ఏపీలో ఎన్నికల నిర్వహణపై కేంద్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచుతోంది. రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతపై మరోమారు ఏపీ అధికారులతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఈ నేపధ్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో సీఈసీ బృందం రాష్ట్రానికి రానుంది. సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ కూడా ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. సీఎస్, డీజీపీలు సహా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం సమావేశం కానుంది.
సీఎం జగన్ సమక్షంలో బళ్ళారి మాజీ ఎంపీ శాంతమ్మ వైసీపీలో చేరారు. గతంలో ఆమే బీజేపీ ఎంపీగా పని చేశారు. అయితే.. హిందూపూర్ ఎంపీగా బరిలో శాంతమ్మను నిలబెట్టాలని అధిష్టానం భావిస్తుంది. ఈ క్రమంలోనే పార్టీలో అధికారికంగా చేరింది. ఈ సందర్భంగా శాంతమ్మ మాట్లాడుతూ.. వైసీపీ సిద్దాంతాలు, పనులు చూసి పార్టీలో చేరానని అన్నారు. దేశంలో ఏ పార్టీ చేయని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేస్తున్నారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నట్లు షర్మిల అన్నారు. రేపే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్టానాన్ని కలుస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలిసి నడవాలని ఉద్దేశంతోనే తెలంగాణలో పోటీ చేయలేదని షర్మిల చెప్పారు. ఇదిలా ఉంటే.. తెలంగాణలో తమ మద్దతుతోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. తెలంగాణలో 31 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము పోటీ పెట్టకపోవడమే ప్రధాన కారణమని షర్మిల పేర్కొన్నారు. కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు తన వంతు కృషి చేశానని తెలిపింది. రెండు…
మాజీ మంత్రి నారాయణ పై నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి నేనే పోటీ చేస్తున్నా.. దమ్ముంటే జనసేన నేత మనుక్రాంత్ రెడ్డి కాదు.. నేనే పోటీ చేస్తానని మాజీ మంత్రి నారాయణ ప్రకటించాలని అన్నారు. కనిగిరి, కందుకూరు, వెంకటగిరి లేదా నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం చేస్తున్నారు.. అంటే నాకు అంత సత్తా ఉందని గుర్తించాలని అనిల్ అన్నారు. మీ లాగా పక్క నియోజకవర్గంలో పనికిరాని అభ్యర్థిని…
దాడి వీరభద్రరావు రాజీనామాపై ఐటీ మంత్రి అమర్నాథ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిదని అన్నారు. వైసీపీలో గెలిచే వారికి సీట్లు, కాంప్రమైజ్ కన్విన్స్ ఉండదని తెలిపారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ స్పష్టంగా చెప్పిందని అన్నారు. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవీ సుబ్బారెడ్డి కూడా చెప్పారని తెలిపారు. టికెట్లు రాని వ్యక్తులు పార్టీకి దూరంగా ఉండటం వల్ల పార్టీకి నష్టం లేదని వివరించారు. దాడి…