కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలి చైర్మన్ మోషెన్ రాజు, జూపూడి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. టీడీపీ, జనసేనపై విరుచుకుపడ్డారు. చాలా మంది బ్లడ్ రిలేషన్ కూడా కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, కొందరు కొత్త వాళ్ళు జగన్ ను దించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Merugu Nagarjuna: జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చింది..
చంద్రబాబు చేసే మేలు వలన పవన్ యు టర్న్ తీసుకుంటున్నాడని ఎంపీ సురేష్ వ్యాఖ్యలు చేశారు. పవన్ ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి రావాలి అనుకుంటున్నాడని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితం ఫెయిర్ కాదని ఆరోపించారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేయడానికి భయపడి ఎక్కడ పోటీ చేస్తే మంచిది అని విజయవాడలో అడుగుతున్నాడని విమర్శించారు. సినిమాలో తప్ప రాజకీయాలలో సక్సెస్ లేని వ్యక్తి పవన్ అని మండిపడ్డారు. రాజకీయాల్లో త్రివిక్రమ్ రాసిన సినిమా డైలాగ్ లు చెప్తున్నాడన్నారు. కాగా.. తెలంగాణ ఎన్నికల్లో పవన్ కి డిపాజిట్లు కూడా రాలేదని ఎంపీ విమర్శలు గుప్పించారు.
INDIA bloc: ఇండియా కూటమిలో లుకలుకలు.. కాంగ్రెస్‌పై జేడీయూ నేత ఆరోపణలు..
అనంతరం మండలి చైర్మన్ మోషెన్ రాజు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సామాజిక న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు రాష్ట్రంలో మంత్రులు అయ్యారన్నారు. కావున.. రాష్ట్రంలో జగన్ కి అందరూ మద్దతు తెలిపాలని ఆయన కోరారు. బలహీన వర్గాలకు మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారని మోషెన్ రాజు తెలిపారు.