తనకు వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు. ‘నాయకులకు, కార్యకర్తలకు నా ముఖ్యమైన విజ్ఞప్తి. ఇది అసత్యం… ఇలాంటి ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని సూచించారు. నిరంతరం ప్రభుత్వ కార్యక్రమాల్లో తిరగడంతో కాస్తా డీ హైడ్రేషన్ కి గురి అయ్యానని తెలిపారు. ప్రస్తుతం విశాఖపట్నం మెడికవర్ ఆసుపత్రిలో అబ్జర్వేషన్ లో ఉన్నానని.. సోమవారం నుండి యథావిధిగా ప్రభుత్వ, ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటానని అన్నారు. పరామర్శల పేరుతో ప్రజలెవరు తన వద్దకు రావొద్దని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం నేను కచ్చితంగా పర్యటిస్తా. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తా. ఇది నా బాధ్యత. ఎవరు ఎన్ని అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అని స్పీకర్ సీతారాం తెలిపారు.