కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిక వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆరోపించారు. ప్రజలా? కుటుంబమా అన్న ప్రశ్న వస్తే మా ముఖ్యమంత్రి ఛాయిస్ ప్రజలేనని తెలిపారు. రాజకీయాల్లో కుటుంబానికి ప్రాధాన్యత ఉండకూడదు అంటూనే మళ్ళీ ఈ వాదన ఎందుకు తెస్తున్నారు? అని సజ్జల ప్రశ్నించారు. వివేకానందా రెడ్డి తమకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు.. ఫలితం ఏమయ్యిందని అన్నారు. కాగా.. జగన్ కుటుంబం కోసం పార్టీ పెట్టలేదని తెలిపారు. తమ విధానాలు తమకు ఉన్నాయని.. పార్టీ వీడటానికి కారణం వాళ్ళే చెప్పారన్నారు. ఎఫెక్ట్ అయిన తర్వాత వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుందని సజ్జల తెలిపారు.
Uddhav Thackeray: రామ మందిర వేడుకలకు ఆహ్వానం లేదు.. ఆ రోజు ఏం చేయబోతున్నారో చెప్పిన సీనియర్ నేత
సాధ్యమైనంత ఎక్కువగా గెలుపు గుర్రాలను ఎంపిక చేసే ప్రయత్నం చేస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టికెట్ ఇవ్వటమే కిరీటం కాదని చెప్పారు. నియోజకవర్గాల్లో మార్పులు ఏ పార్టీలో అయినా అంతర్గతంగా జరిగాల్సిన కసరత్తు అని అన్నారు. నచ్చ చెప్పే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.. మార్పులు చేసిన చోట స్పందన బాగుందన్నారు. ఇదిలా ఉంటే.. లోకేశ్ పై సజ్జల తీవ్ర విమర్శలు గుప్పించారు. లోకేష్ తాతను చంపింది ఎవరు అని ప్రశ్నించారు. బాలింతలు, పసి పిల్లలు ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకోమని టీడీపీ చెబుతుందా? అని ప్రశ్నించారు. ఎస్మా అంటే అత్యవసర సేవలు అన్న విషయం స్టాన్ ఫర్డ్ లో చదువుకున్న లోకేష్ కు తెలియదా? అని విమర్శలు జల్లు కురిపించారు.
ChandraBabu Tour: రేపు ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చంద్రబాబు పర్యటన.. షెడ్యూ్ల్ ఇదే..!
ఇదిలా ఉంటే.. అంగన్వాడీలు సమ్మె మొదలు పెట్టి నెల దాటింది… అయినా అలా వదిలేయాలా? అని సజ్జల ప్రశ్నించారు. మేమెంతో సంయమనంతో ఉన్నాం.. ఆ బరువు ఇప్పుడు మోయలేం అని చాలా సార్లు చెప్పామని తెలిపారు. అయినా ఒకటి, రెండు డిమాండ్ల పై పట్టుబడుతున్నారని అన్నారు. రైతులను గుర్రాలతో తొక్కించింది ఎవరు? అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చివరలో సజ్జల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమకు ఇప్పటికీ వైఎస్ మరణం పై అనుమానాలు ఉన్నాయన్నారు. షర్మిల సీఎం రమేష్ హెలికాప్టర్ లో రావటం, బ్రదర్ అనిల్ బీటెక్ రవితో భేటీ… చూస్తే వెనుక ఎవరు ఉన్నారో అర్థం అవుతుందని సజ్జల ఆరోపించారు.