Merugu Nagarjuna: విశాఖ జిల్లా ఉత్తర నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరుగుతుంది. అందులో భాగంగానే అక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో సామాజిక విప్లవం వచ్చిందని తెలిపారు. సామాజిక సాధికారత సాధించామన్నారు. కాగా.. బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన నాయకుడు చంద్రబాబు అని మంత్రి మేరుగ మండిపడ్డారు. పేదవాడు ఉన్నత శిఖరాలకు వెళ్ళడమే సామాజిక న్యాయమని మంత్రి పేర్కొన్నారు.
Read Also: Tammineni Sitaram: నాకు వ్యాధి, జబ్బు వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారు
చంద్రబాబు కోర్టులకు వెళ్ళి అభివృద్ధిని అడ్డుకున్నారని మేరుగ విమర్శలు చేశారు. చంద్రబాబు అంతు చూడాల్సిన సమయం వచ్చిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో పేదరికం తగ్గిందని తెలిపారు. చంద్రబాబు చంద్రగిరిలో పుట్టి.. కుప్పంలో పోటీ చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో జగన్ బొమ్మతో గెలవబోతున్నామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే.. లోకేశ్ యువగళంలో సగం దూరం నచిడి పారిపోయాడని దుయ్యబట్టారు. నీ ఎర్రపుస్తకం మడిచి మీ బాబుకు ఇవ్వని విమర్శించారు. నారా భువనేశ్వరి రెండే రెండు చెక్కులు ఇచ్చిందని మంత్రి మేరుగ నాగార్జున కామెంట్స్ చేశారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: షర్మిల కాంగ్రెస్లో చేరిక వెనుక అతని కుట్ర ఉంది..
అనంతరం ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ.. బీసీ అయిన తనను ఉప ముఖ్యమంత్రిగా సీఎం జగన్ పక్కన కూర్చోబెట్టుకున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. అంతేకాకుండా.. వైఎస్సార్ చేయూత, ఆసరా ద్వారా మహిళలను ఆదుకుంటున్నారని అన్నారు.
రైతులు, మహిళలను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలను సీఎం జగన్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా.. పిల్లలు కోసం ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారని అన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు.. పేదలకు 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చారని బూడి ముత్యాల నాయుడు తెలిపారు.