Byreddy Rajasekhar Reddy: వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ నకిలీ రెడ్డి కాబట్టే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నాడని మండిపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన జి.పుల్లారెడ్డి రామజన్మ భూమి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. రెడ్లు అంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారు పేరని బైరెడ్డి పేర్కొన్నారు. రెడ్డి తోక పెట్టుకొని కొందరు నకిలీ రెడ్లుగా చలామణి అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Tiger 3 : సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన సల్మాన్ ఖాన్ ‘టైగర్ 3’
అనంతపురంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి విగ్రహా ఆవిష్కరణ జరగాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించకుండా ప్రభుత్వం అడ్డుకుందని ఆయన ఆరోపించారు. రెడ్లకు ఇలాంటి ఘోరం అవమానం ఎప్పుడూ జరగలేదని తెలిపారు. జగన్ వెంటనే రెడ్లకు క్షమాపణ చెప్పాలని అన్నారు. అనంతపురంలో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి విగ్రహా ఆవిష్కరణ చేయాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
Read Also: Ram Mandir: ముస్లిం కరసేవకుడికి రామాలయ ఆహ్వానం.. ఎన్నో ఏళ్ల తపస్సు అని హబీబ్ భావోద్వేగం..