హైదరాబాద్ నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ లో సిటీ పోలీస్ స్టాల్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్త శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్ మాన్, జాయిన్ సీపీ విశ్వ ప్రసాద్, డీసీపీ సెంట్రల్ జోన్, డీసీపీ ట్రాఫిక్, ఎగ్జిబిషన్స్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్, సైబర్ క్రైమ్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, షీ టీమ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. స్కూల్, కాలేజ్ పిల్లలు, నగర వాసులకు ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ పోలీస్ వద్ద ఉండే పరికరాలు, వారి పనితీరు పై స్టాల్స్ లో అవగాహన కల్పించనున్నారు.
Harish Rao: మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్కి చూపెట్టింది ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా..
ఈ సందర్భంగా సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నుమాయిష్ చూస్తుంటే 22 ఏళ్ల క్రితం తాను ట్రాఫిక్ విభాగంలో పని చేసే రోజులు గుర్తు వస్తున్నాయని అన్నారు. మరోవైపు.. ఎగ్జిబిషన్ జరుగుతున్నన్ని రోజులు.. ట్రాఫిక్ విభాగంలో 45 రోజులు అలెర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ ఖిల్లా, నుమాయిష్ అని చెప్పుకోవచ్చు అని పేర్కొ్న్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని తెలిపారు.
Chicken Price: చికెన్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి పడిపోయిన ధరలు..
ఈ ఏడాది కూడా పోలీస్ స్టాల్స్ ఏర్పాటు చేసామని సీపీ చెప్పారు. ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసామన్నారు. ట్రాఫిక్, షీ టీమ్స్, సైబర్ క్రైమ్స్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ స్టాల్స్ ఏర్పాటు చేసామని తెలిపారు. అంతేకాకుండా.. షీ టీమ్స్ పనితీరు, సమస్య వచ్చినప్పుడు మహిళలు ఎలా వ్యవహరించాలి అనే అంశంపై అవేర్ నెస్ కల్పిస్తామన్నారు. గత ఏడాది 1లక్ష 20 వేల మంది పోలీస్ స్టాల్ సందర్శించారని అన్నారు. ఈ ఏడాది కూడా ప్రజలు.. భారీగా పోలీస్ స్టాల్ సందర్శించి అవగాహన తెచ్చుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. స్టాల్స్ ఏర్పాటుకు సహకరించిన అధికారులను అభినందిస్తున్నట్లు సీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.