ముంబై నుంచి బెంగళూరుకు ఇండిగో ఫ్లైట్ నంబర్ 5047లో ప్రయాణిస్తుండగా ఓ ప్రయాణికుడికి ఊహించని సమస్య ఎదురైంది. తన సీటులోని కుషన్ కనిపించకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఒత్తిడికి లోనైన మెన్సా బ్రాండ్స్ వ్యవస్థాపకుడు అనంత్ నారాయణన్.. సోషల్ మీడియాలో అందుకు సంబంధించి ఓ వీడియోను పోస్ట్ చేసారు. అది చూసిన నెటిజన్లు.. రకరకాలుగా కామెంట్స్ చేశారు. నారాయణన్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. ఎయిర్‌లైన్ పట్ల తన నిరాశను వ్యక్తం చేస్తూ, “2 గంటలు ఆలస్యంగా వచ్చిందని, @IndiGo6E ఫ్లైట్ 5047లో సీట్లు లేవు! సేవ నిజంగా అధ్వాన్నంగా ఉన్నట్లుంది!” అనే క్యాప్షన్‌తో పాటు వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read Also: Moinabad: ఉత్కంఠ రేపుతున్న మొయినాబాద్ యువతి మర్డర్ కేసు..
కాగా.. నారాయణన్ పోస్ట్‌పై ఎయిర్‌లైన్ ఇండిగో వెంటనే స్పందించి అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. సర్, మేము అసౌకర్యానికి నిజంగా చింతిస్తున్నాము. మా సిబ్బందిలో ఒకరు మీతో టచ్‌లో ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. మేము మీకు రిజిస్టర్డ్ నంబర్‌కు కాల్ చేయడానికి ప్రయత్నించాము, అయితే కనెక్ట్ కాలేదు. ఇప్పుడు ఏ క్షణంలోనైనా విమానం గాలిలో ఉంటుంది. మేము మీకు సౌకర్యవంతమైన విమాన సమయాన్ని కోరుకుంటున్నాము. అని చెప్పింది.
Read Also: Hanuman: హనుమాన్ షూట్లో రెండు ప్రమాదాలు.. ‘తేజ’ను కాటేయబోయిన నల్లత్రాచు
ఈ ఘటనపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విమానయాన సంస్థ ఆదాయం ప్రధానంగా ఆహారం, పానీయాల విక్రయం ద్వారా లభిస్తుందన్న వ్యంగ్యాన్ని ఒక వినియోగదారు ఎత్తి చూపారు. కానీ ఇప్పటికీ, వారు తమ సీట్లను ఈ విధంగా తీసుకోలేరు! సీట్లు లేకుండా, ప్రయాణీకులు తమ విమానంలో ఆహారాన్ని ఎలా ఆర్డర్ చేయగలరు? అని ప్రశ్నించాడు. మరొక వినియోగాదారు.. ఇండిగో వంటి దిగ్గజ విమానయాన సంస్థకు ఇటువంటి లోపం ఆమోదయోగ్యం కాదు. అని రాశాడు.