జనవరి 22న అయోధ్యలో జరగనున్న ‘ప్రాణ్‌ప్రతిష్ఠ’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్.. రాజకీయ కార్యక్రమంగా మార్చారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే ఆ కార్యక్రమంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాము అన్ని మతాలతోనూ ఉన్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. హిందూ మతానికి సంబంధించిన అత్యంత ప్రముఖులు (శంకరాచార్య) కూడా ఇది రాజకీయ కార్యక్రమం అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారన్నారు. అందువల్ల.. ప్రధానమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ చుట్టూ రూపొందించబడిన ఇలాంటి కార్యక్రమానికి వెళ్లడం తమకు చాలా కష్టమని తెలిపారు. అయితే దర్శనానికి వెళ్లాలనుకునే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా వెళ్లవచ్చని అన్నారు.
Read Also: Minister Amarnath: షర్మిళ ప్రభావం ఏపీ రాజకీయాల్లో జీరో..
మరోవైపు భారత కూటమిలో పరిస్థితులు చాలా బాగున్నాయని.. చర్చలు సజావుగా సాగుతున్నాయని రాహుల్ గాంధీ తెలిపారు. త్వరలోనే సీట్ల పంపకం తదితర పనులు పూర్తి చేస్తామన్నారు. సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం, ఆర్థిక న్యాయానికి సంబంధించిన అంశాలను లేవనెత్తడమే ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ లక్ష్యమని రాహుల్ గాంధీ తెలిపారు.
Read Also: Ayodhya Ram Mandir: రామయ్య పాదాల చెంత వెలిగిన 108 అడుగుల భారీ అగరబత్తి.. వీడియో ఇదిగో..!
కాగా.. తాము మణిపూర్ నుండి యాత్ర ప్రారంభించడానికి గల కారణం.. ఇంతకుముందు ఇక్కడ విషాదం జరిగింది. ప్రధాని మణిపూర్‌కు రావడం తగదని, ఇది సిగ్గుచేటని దుయ్యబట్టారు. మరోవైపు.. నాగాలాండ్‌కు ఇచ్చిన హామీని ప్రధాని నెరవేర్చలేదని మండిపడ్డారు. నాగాలాండ్ సమస్యను పరిష్కరించడానికి ప్రజల మాటలు వినడం, కమ్యూనికేట్ చేయడం అవసరమని, కానీ ప్రధాని అలా చేయడం లేదని ఆయన పేర్కొన్నారు. అయితే.. లోక్‌సభ ఎన్నికలకు ముందు చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర.. 67 రోజుల్లో 15 రాష్ట్రాలు, 110 జిల్లాల మీదుగా సాగనుంది.