అఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మంచి ప్రదర్శనను చూపించాడు. టీ20ల్లో 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. ఆదివారం ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి కేవలం 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో.. టీ20 క్రికెట్‌లో 200 వికెట్లు పూర్తి చేసిన 11వ భారత బౌలర్‌గా అక్షర్ పటేల్ నిలిచాడు. ఇదిలా ఉంటే.. అక్షర్ పటేల్ ఇండియా తరపున 52 టీ20 మ్యాచ్‌లు ఆడి 49 వికెట్లు సంపాదించాడు. అంతేకాకుండా.. 361 పరుగులు చేశాడు.
Ram Mandir: అమెరికాలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు.. కార్ల ర్యాలీ నిర్వహించిన భారతీయులు
టీ20ల్లో అక్షర్ పటేల్ 22.52 సగటుతో 2,545 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 134.65గా ఉంది. ఐదు అర్ధశతకాలు కూడా బాదాడు. ఎడమచేతి వాటం స్పిన్నర్, ఎడమచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన రవీంద్ర జడేజా టీ20 ల్లో 200 వికెట్లు, 2,000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి భారత ఆల్ రౌండర్ గా నిలిచాడు. ఈ ఫార్మాట్ లో 216 వికెట్లతో పాటు 3,382 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ రెండో స్థానంలో ఉన్నాడు.
Mahesh Babu: ఛీఛీ.. సిగ్గుండాలిరా.. ఇలా ట్రోల్ చేయడానికి..
టీ20ల్లో అత్యధిక వికెట్లు భారతీయులు
1. యుజ్వేంద్ర చాహల్ – 290 మ్యాచ్‌ల్లో 336
2. పీయూష్ చావ్లా – 284 మ్యాచ్‌ల్లో 302
3. ఆర్ అశ్విన్ – 309 మ్యాచ్‌ల్లో 301
4. భువనేశ్వర్ కుమార్ – 270 మ్యాచ్‌ల్లో 288
5. అమిత్ మిశ్రా – 258 మ్యాచ్‌ల్లో 284
6. జస్ప్రీత్ బుమ్రా – 212 మ్యాచ్‌ల్లో 260
7. హర్భజన్ సింగ్ – 268 మ్యాచ్‌ల్లో 235
8. జయదేవ్ ఉనద్కత్ – 180 మ్యాచ్‌ల్లో 218
9. రవీంద్ర జడేజా – 310 మ్యాచ్‌ల్లో 216
10. హర్షల్ పటేల్ – 178 మ్యాచ్‌ల్లో 209
11. అక్షర్ పటేల్ – 234 మ్యాచ్‌ల్లో 200