అయోధ్య రామమందిరంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా.. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, ప్రముఖ న్యాయవాది పరాశరన్ నుండి అదార్ పూనావాలా వరకు ఐదు వందల మందికి పైగా ప్రత్యేక అతిథులు రానున్నారు. ఈ క్రమంలో.. 100 చార్టర్డ్ విమానాలు రానున్నాయని శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ అంచనా వేస్తుంది. అందుకోసం.. విమానాల పార్కింగ్ కోసం 12 విమానాశ్రయాలను సంప్రదించారు. వీఐపీలను మూడు కేటగిరీలుగా విభజించారు.
Read Also: Hyderabad airport: హైదరాబాద్ నుంచి ప్రపంచ దేశాలకు నేరుగా విమానాలు.. లిస్ట్ ఇదే..
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 20, 21, 22 తేదీల్లో మొత్తం 100 చార్టర్డ్ విమానాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అటువంటి పరిస్థితిలో.. ఈ చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం 1000 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 12 విమానాశ్రయాలను సంప్రదిస్తున్నారు. మూడు రోజుల్లో దాదాపు వంద చార్టర్డ్ విమానాలు వస్తాయని అనుకుంటున్నట్లు.. అందుకు ఏర్పాట్లు చేయాలని ఎయిర్‌పోర్టు అధికారులను కోరామని చంపత్ రాయ్ తెలిపారు.
Read Also: Ram Date of Birth: శ్రీ రాముడు పుట్టింది ఎప్పుడో తెలుసా..?
జనవరి 22న దాదాపు 50 చార్టర్డ్ విమానాలు అయోధ్యకు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో.. చార్టర్డ్ విమానాల పార్కింగ్ కోసం అయోధ్య విమానాశ్రయం నుండి గోరఖ్‌పూర్, గయా, లక్నో, ఖుజ్రాహో విమానాశ్రయాలను సంప్రదిస్తున్నారు. ఇదిలా ఉంటే.. అయోధ్యలో వీఐపీలకు బస చేసేందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అంతేకాకుండా.. రామ్ మందిర్ ట్రస్ట్ ప్రత్యేక అతిథుల కోసం QR కోడ్‌తో కూడిన ప్రత్యేక కార్డ్‌ను కూడా సిద్ధం చేసింది.