పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామన్నారు. ఈరోజు సాయంత్రం ఎస్సారార్ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్.. ఎల్లుండి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పనులను పరిశీలించారు. కేంద్ర…
ప్రపంచంలోనే ఇప్పటివరకూ కనీవినీ ఎరుగని రీతిలో ఓ ఖైదీకి వినూత్న రీతిలో మరణశిక్ష అమలకు అమెరికా శ్రీకారం చుట్టింది. తొలిసారిగా నైట్రోజన్ గ్యాస్‌ను ఉపయోగించి ఓ దోషికి మరణశిక్ష అమలు చేసింది. హత్య కేసులో కెన్నెత్ స్మిత్ (58) అనే వ్యక్తికి మరణశిక్ష పడింది. స్మిత్‌కి నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష అమలు చేయాలని అమెరికాలోని అలబామా కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జైలు అధికారులు నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి స్మిత్‌కు మరణశిక్ష అమలు చేశారు. నైట్రోజన్ సిలిండర్‌కు అమర్చిన పైపును మాస్క్ ద్వారా…
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఅర్. బీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది అని ప్రజలకు తెలుసు అని అన్నారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ఆ పోటీలో బీఆర్ఎస్ దే పై చేయి ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మళ్ళీ కలుద్దాం.. లోక్ సభ…
హైదరాబాద్ వేదికగా ఇండియా- ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. గురువారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో.. టాస్ గెలిచిన ఇంగ్లీష్ టీమ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కాగా.. మొదటి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేసి ఆలౌటైంది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా.. మొదటి రోజు 119 పరుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది. రెండవ రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. ఈరోజు ఆట ముగిసే సమయానికి 7 వికెట్లు కోల్పోయి 421 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ పై…
రిపబ్లిక్ డేను పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో తేనేటి విందు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు ఎట్‌హోం కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ ప్రోగ్రామ్‌కి అధికార, ప్రతిపక్ష నేతలను గవర్నర్ ఆహ్వానించారు. రాజ్‌భవన్‌లో జరిగి ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ఇందుకోసం రాజ్‌భవన్ సుందరంగా ముస్తాబైంది. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ హాజరుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గులాబీ పార్టీ నేతలు హాజరవుతారా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచీ ప్రగతిభవన్‌కు రాజ్‌భవన్…
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందనవెల్లి గ్రామంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. ఈ సంద్భంగా.. చందనవెల్లి భూ బాధితులు ఆయనను కలిశారు. అనంతరం వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చందనవెల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 190లోని భూసేకరణలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని అన్నారు. ఎంజాయ్ మెంట్ సర్వే పేరిట భూమి లేని వారి పేర్లను భూ సేకరణలో చేర్చి నిజమైన రైతులకు పరిహారం ఇవ్వలేదని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ…
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వివిధ నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు గుడ్‌న్యూస్ చెప్పింది. సత్ ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయాలని రేవంత్‌రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. రిపబ్లిక్ డే సందర్భంగా కొంత మంది ఖైదీలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. జీవిత ఖైదు అనుభవిస్తూ అనారోగ్యం, వృద్ధాప్యం, ఇతర సమస్యలతో బాధపడుతున్న ఖైదీల శిక్షాకాలాన్ని తగ్గిస్తూ క్షమాభిక్ష ప్రసాదించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పని చేసిందని తెలిపారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ.. కోదండరామ్ ను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలనే కోదండరాంని ఎన్నుకున్నారని తెలిపారు. కోదండరాం డైరెక్షన్ లో తాను లేనన్నారు. కోదండరాం భీష్మ పాత్ర పోషించారని అన్నారు.
మెదక్: పార్లమెంట్ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతోంది. గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపికకు తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కేడర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనైనా మెజార్టీ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ ఎన్నికల మూడ్‌లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కార్యకర్తలను చైతన్య పరిచారు. ఆరు…
తెలుగు రాష్ట్రాలను పద్మ పురస్కారాలు వరించాయి. గురువారం కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో ఏపీకి రెండు పద్మవిభూషణ్‌లతో పాటు ఒక పద్మశ్రీ, తెలంగాణకు ఐదు పద్మశ్రీలు లభించాయి. ఈ సందర్భంగా పద్మశ్రీ గ్రహీతలు తమ సంతోషాన్ని ఎన్టీవీతో పంచుకున్నారు.