Rajesh Veeramalla
Author- NTV Telugu-
BJP Telangana: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు.. కారణమదే..!
కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు అయింది. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో టూర్ క్యాన్సిల్ అయింది. వాస్తవానికి ఆదివారం రాష్ట్రంలో పర్యటించాల్సి ఉంది. ఈ క్రమంలో రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు.. ఇలాంటి వాటికి బెదిరేది లేదన్న పల్లా
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయింది.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఏ1 గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2 గా భార్య నీలిమా, ఏ3 మధుకర్ రెడ్డి పేర్లను చేర్చారు. కొర్రెముల్ల సర్వే నెంబర్ 796లో ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 38ఈ హోల్డర్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. పదేళ్లుగా 200 మందిని పల్లా రాజేశ్వర్ రెడ్డి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 300… -
At Home Program: రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్, పలువురు నేతలు
రాజ్ భవన్లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆతిథ్యం ఇవ్వగా.. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరిగింది. కాగా.. ఈ కార్యక్రమానికి పలువురు బీజేపీ నేతలు హాజరుకాగా.. బీఆర్ఎస్ నేతలు మాత్రం హాజరు కాలేదు. -
Kishan Reddy: భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేసేందుకే ఈ కార్యక్రమం..
హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతమాత మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, చినజీయర్ స్వామి హాజరయ్యారు. అంతేకాకుండా.. ఈ కార్యక్రమంలో హనుమాన్ సినిమా బృందం పాల్గొంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారత మాత విగ్రహానికి పూలమాల వేసి.. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి భారత మాత మహా హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు కిషన్ రెడ్డి. -
Car Accident: మంటల్లో కాలి బూడిదైన కారు.. సికింద్రాబాద్లో ఘటన
సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఓ కారు అగ్నికి ఆహుతైపోయింది. ఫ్లై ఓవర్ వద్ద కారు ఇంజన్ భాగం నుంచి పొగలు వస్తుండడం గమనించిన గోపాలపురం ట్రాఫిక్ కానిస్టేబుల్.. వాహనం పక్కకు నిలపాలని కారు యజమానికి సూచించాడు. కారు పక్కకు ఆపి కిందకు దిగేలోపే ఇంజన్ భాగం నుంచి మంటలు చెలరేగగా.. వెంటనే కారులో మొత్తం మంటలు వ్యాపించాయి. అప్పటికే యజమాని పక్కకు తప్పుకోగా.. నిమిషాల్లో కారు మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి… -
Harish Rao: కాంగ్రెస్ అహంకార పూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు..
తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఎర్రవల్లి ఫాంహౌస్ లో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో కేసీఆర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు, ప్రత్యర్థులపై దాడుల గురించి తాము ఆలోచించలేదు, ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న విషయంపై ఆలోచించామన్నారు. ప్రతిపక్షాలపై ఎలా బురద జల్లాలి, ప్రజల్లో ఎలా బద్నాం చేయాలన్న విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని హరీష్ రావు… -
Bandi Sanjay: గవర్నర్‌ను బీఆర్ఎస్ ఎలా ఇబ్బంది పెట్టిందో ప్రజలు మరిచిపోలేదు..
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలే రద్దు చేశారని వ్యాఖ్యానించారు. గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అంటూ ధ్వజమెత్తారు. మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని గుర్తుచేశారు. కనీసం గవర్నర్ పర్యటనలకు ప్రొటోకాల్ కూడా పాటించలేదని.. అంతేకాకుండా అధికారులను కూడా గవర్నర్ వద్దకు వెళ్లనీయలేదని మండిపడ్డారు. -
Deputy CM: ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి..
రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం చందన వెళ్లి గ్రామంలో జున్నా సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంటును డిప్యూటీ సీఎం ప్రారంభించారు. స్ట్రింగర్ మిషన్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. సోలార్ ప్యానల్ ఉత్పత్తికి సంబంధించి గ్లాస్ లోడింగ్,… -
Vivek Venkataswamy: కాళేశ్వరం ఫెయిల్యూర్ ప్రాజెక్ట్.. బీఆర్ఎస్పై తీవ్ర ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అన్నారం బ్యారేజీ వలన వరద ముంపునకు గురవుతున్న సుందరశాల గ్రామ పంట భూములను వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా వివేక్‌కు తమ బాధలు చెప్పుకుంటూ సుందరశాల గ్రామ రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని మాజీ సీఎం కేసీఆర్ వృథా చేశారని విమర్శించారు. అవినీతి కేసీఆర్‌ను వెంటనే జైల్లో వేయాలని వివేక్ డిమాండ్ చేశారు. -
Bandi Sanjay: కరీంనగర్ నుండే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల శంఖారావం..
పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని కరీంనగర్ నుండే పూరించబోతున్నామని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చెప్పారు. అందులో భాగంగా ఈనెల 28న కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో 10 నుండి 20 వేల మంది బీజేపీ కార్యకర్తలతో పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం నిర్వహించబోతున్నామన్నారు. ఈరోజు సాయంత్రం ఎస్సారార్ కళాశాలకు విచ్చేసిన బండి సంజయ్.. ఎల్లుండి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనానికి సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. పనులను పరిశీలించారు. కేంద్ర…
తాజావార్తలు
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!