మారుమూల గిరిజన ప్రాంతాల్లో 300 4-జీ సెల్‌టవర్స్‌ను సీఎం జగన్ క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. మారుమూల గిరిజన ప్రాంతాలకు సమర్ధవంతమైన టెలికాం సేవలు అందించేందుకు ఎయిర్ టెల్ ఆధ్వర్యంలో 136, జియో ఆధ్వర్యంలో 164 టవర్లు ఏర్పాటు చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 246, పార్వతీపురం మన్యం జిల్లాలో 44, ప్రకాశం జిల్లాలో 4, శ్రీకాకుళం జిల్లాలో 4, కాకినాడలో ఒక ఏర్పాటు చేశారు.
ఎన్నికల సమరానికి వైసీపీ సిద్ధమైంది. ఈనెల 27నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా భీమిలిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అంతేకాకుండా.. భీమిలిలో తొలి క్యాడర్ మీటింగ్ చేపట్టనున్నారు. మరోవైపు.. ఎన్నికల శంఖారావం సభ "సిద్ధం" పోస్టర్ ను వైవీ సుబ్బారెడ్డి, బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. దాంతో పాటు "సిద్ధం"థీమ్ సాంగ్ కూడా విడుదల చేశారు. ఇదిలా ఉంటే.. విశాఖలో భారీ హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. పిడికిలి బిగించిన సీఎం జగన్ ఫొటోకు 'సిద్ధం' అనే టైటిల్ తో…
కోవర్టు నాని ఊసరవెల్లి.. లాగా బిహేవ్ చేస్తున్నాడని కేశినేని నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబ్బా కొడుకులు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఆయారం... గాయారం టైప్ అని.. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో కట్టిన ప్రతి ఫ్లై ఓవర్ చంద్రబాబు కట్టించిందేనని తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఫ్లై ఓవర్ కట్టడానికి తనకు సంబంధించిన సోమా కంపెనీకి ఇవ్వకపోతే ఇబ్బంది పెట్టాడని.. చంద్రబాబు పిలిచి వార్నింగ్ ఇస్తే అప్పుడు సైలెంట్…
కేంద్రం సుముఖంగా లేకపోయినా.. రాష్ట్ర ప్రభుత్వం కుల గణన కార్యక్రమాన్ని సాహసోపేతంగా నిర్వహిస్తోందని బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు తెలిపారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ సిబ్బందితో కలిసి కులగనన జరుగుతున్న తీరును మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై విమర్శల జల్లు కురిపించారు. ఏపీలో కులాల స్థితిగతులపై చంద్రబాబుకు ఏమాత్రం అవగాహన లేదని విమర్శించారు. ఈ నెల 19న ప్రారంభమైన కుల గణన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయబోతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో…
విజయవాడలోని భవానీపురం జిల్లా పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నేతల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, మంత్రి జోగి రమేష్, మాజీ మంత్రి పేర్ని నాని, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఏలూరులో జనవరి 30న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వైసీపీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానాలు పలికామని తెలిపారు. గడచిన ఐదు సంవత్సరాల పాలనపై ముఖ్యమంత్రి జగన్…
భవిష్యత్తును మార్చుకునేందుకు రాజ్యాంగం కల్పించిన అవకాశం ఓటు హక్కు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పాలకులను ప్రశ్నించే అధికారం ఇచ్చేది ఓటు అని పేర్కొన్నారు. రాతియుగం నుంచి స్వర్ణయుగం వైపు మిమ్మల్ని నడిపించేది.. మంచి సమాజాన్ని నిర్మించేది ఓటు అని తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్తగా ఓట్ల దొంగలు వచ్చారని.. ఓటు దొంగలు ఓటు తీసేస్తారని .. లేదా మార్చేస్తారు.. నకిలీ ఓట్లు చేర్చేస్తారని ధ్వజమెత్తారు.
ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరుగునున్న తరుణంలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మేనిఫెస్టో ప్రకటించింది. కాగా.. ఏపీ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు జేడీ లక్ష్మీనారాయణ సిద్ధమవుతున్నారు. అయితే.. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, నిరుద్యోగుల కోసం పలు హామీలు ఇచ్చారు. వీటిని పక్కాగా అమలు చేస్తామన్నారు. ఈ మ్యానిఫెస్టోను ఆయా వర్గాలతోనే విడుదల చేయించడమే కాకుండా దీనికి పీపుల్స్ మ్యానిఫెస్టోగా వీవీ…
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం రాంలాలా పవిత్రోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తాజాగా.. ప్రధాని మోదీ ఆ లేఖకు కృతజ్ఞతలు తెలిపారు. అయోధ్యను నా గుండెల్లో పెట్టుకొని ఢిల్లీకి తిరిగి వచ్చాను.. తన జీవితంలో మరచిపోలేని క్షణాలను చూసి అయోధ్య నుంచి తిరిగి వచ్చిన తర్వాత మీకు ఈ లేఖ రాస్తున్నానని ప్రధాని మోడీ తెలిపారు. మీరు రాసిన లేఖ అందే సమయానికి నా మనసు భావోద్వేగంతో నిండిఉంది.. దాని నుంచి బయటపడేందుకు మీ లేఖ ఎంతో సహాయపడిందని అన్నారు.…
బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అయోధ్యకు భారీగా భక్తులు పోటెత్తారు. అయితే మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అనుమతిస్తుండటంతో లక్షలాది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య మొత్తం కిక్కిరిసిపోయింది. కాగా.. ఈరోజు రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా.. రాముడిని దర్శించుకునే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరీ ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. రాష్ట్రపతి విడుదల చేసిన ప్రకటనలో ఆయనకు భారతరత్న ఇవ్వనున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఆయన శతజయంతి సందర్భంగా మరణానంతరం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. కాగా.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న అవార్డు ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఓ పోస్ట్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. బీహార్‌లో ప్రజా నాయకుడిగా ఎదిగిన కర్పూరీ ఠాకూర్ 1924లో జన్మించారు. ఆయన బీహార్‌కు కాంగ్రెసేతర మొదటి…