బీఆర్ఎస్ పార్టీ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్ర విభజన కోసం కాంగ్రెస్ పని చేసిందని తెలిపారు. కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై ఆయన మాట్లాడుతూ.. కోదండరామ్ ను బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మోసం చేసిందో తెలిపారు. ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు ఒక ఛత్రి కింద ఉండాలనే కోదండరాంని ఎన్నుకున్నారని తెలిపారు. కోదండరాం డైరెక్షన్ లో తాను లేనన్నారు. కోదండరాం భీష్మ పాత్ర పోషించారని అన్నారు.
KCR: లోక్‌సభ ఎన్నికలపై కేసీఆర్ కసరత్తు.. నేతలతో ఏం చర్చించారంటే..!
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ మాటలకు హద్దులు లేవని జగ్గారెడ్డి విమర్శించారు. కోదండరాం గురించి మాట్లాడే అంత ఉందా అని కేటీఆర్ పై ఫైరయ్యారు. మీరు జేఏసీ కన్వీనర్ గా ఉన్న కోదండరాం ఇంటికి ఎన్ని సార్లు పోలేదు అని కేటీఆర్ ను ప్రశ్నించారు. ఉద్యమం సమయంలో కోదండరాం మీకు దేవుడు లెక్క చూశారన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న తొమ్మిదేండ్లలో కోదండరామ్ కి ఎప్పుడైనా అప్పోయింట్ మెంట్ ఇచ్చారా..? అని దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లలో కోదండరాం గురించి నోరు మెదపని కేటీఆర్.. ఇప్పుడు తాము ఎమ్మెల్సీ చేస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాంను అవమానించింది మీరు.. తాము గౌరవిస్తున్నామని బీఆర్ఎస్ నేతలపై జగ్గారెడ్డి మండిపడ్డారు.
Gunturu Kaaram : గుంటూరు కారం నుంచి ‘అమ్మ’ ఎమోషనల్ సాంగ్ రిలీజ్…
ఎమ్మెల్సీలుగా మీరు ఎవరిని పెట్టారని జగ్గారెడ్డి బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. విలువలతో కూడిన రాజకీయాలు తాము చేస్తామన్నారు. విలువ లేకుండా రాజకీయాలు చేస్తుంది కేటీఆర్ అని దుయ్యబట్టారు. కేటీఆర్ గవర్నర్ కి కృతజ్ఞతలు చెప్పాలని పేర్కొన్నారు. కోదండరాంని తాము ఎమ్మెల్సీ చేయలేకపోయామని.. మీరైనా చేశారు అని అభినందించు కేటీఆర్ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బయటకు చెప్పలేకపోయినా.. మనసులో అయినా చెప్పుకోండని విమర్శించారు.