బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నేతలకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు బీఆర్ఎస్ అధినేత కేసీఅర్. బీఆర్ఎస్ సంస్థాగతంగా బలంగా ఉందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నిరాశ చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుంది అని ప్రజలకు తెలుసు అని అన్నారు. కాగా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని కేసీఆర్ తెలిపారు. ఆ పోటీలో బీఆర్ఎస్ దే పై చేయి ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత మళ్ళీ కలుద్దాం.. లోక్ సభ ఎన్నికల వ్యూహం పై చర్చిద్దామని పార్టీ నేతలకు తెలిపారు.
Read Also: IND vs ENG: రెండో రోజు ముగిసిన ఆట.. ఆధిక్యంలో భారత్
తెలంగాణ హక్కులకోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కేసీఆర్ పేర్కొన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలని నేతలను కోరారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలన్నారు. నది జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్ లో ఉన్న రాష్ట్ర విభజన హామీల సాధనకోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ ది అని అన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనని కేసీఆర్ సూచించారు. కాగా.. ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై నేతలతో మేథోమదనం చేశారు.
Read Also: AP Accident : ఏపీలో ఘోర ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి..