అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మ జ్యోతిరావు బాపూలే విగ్రహ ప్రతిష్టాపన కోసం భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి పలు సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోందని తెలిపారు. పార్లమెంట్ లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశామని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో జ్యోతిరావు బాపూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. పూలే విగ్రహం పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని అన్నారు. బీసీల…
ఎమ్మెల్సీ కవిత కామెంట్స్కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణానికి కారణమైన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినట్టే చేస్తారనుకోవడం విచారకరమని తెలిపారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4 గా ఉన్న సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని సైతం అరెస్ట్…
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన దళాల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.
కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 34 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. తెలంగాణలో ఇద్దరికి పద్మ శ్రీ అవార్డులు దక్కాయి. అందులో యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద వాసి బుర్ర వీణ వాయిద్యకారుడు దాసరి కొండప్ప ఉన్నారు. ఏపీకి చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మ శ్రీ లభించింది.
తమ్ముడూ అంటూ శ్రీశైలం ఎమ్మెల్యే పై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మండిపడ్డారు. తనకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, రాజకీయ అరగ్రేటం చేసింది తన వల్లేనని భూమా అఖిలప్రియ అన్నారు. నువ్వు, నీ రహస్య మిత్రుడు, మా కోవర్ట్ కుమ్మక్కై నన్ను జైలుకు పంపారని అఖిలప్రియ ఆరోపించారు. 2014లో చక్రపాణి రెడ్డిని జగన్ కొత్తపల్లె వద్ద కారులో నుంచి దింపేశారు, కోవర్టు కూడా అక్కడే తన్నులు తిన్నాడని భూమా అఖిలప్రియ అన్నారు.
తన రాజీనామా ఆమోదంపై గంటా శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. మూడేళ్ల కింద చేసిన రాజీనామాను ఇప్పుడు ఆమోదించడంపై గంటా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీనామా ఆమోదంలో ప్రొసీజర్ ఫాలో కాలేదంటూ గంటా పిటిషన్ వేశారు. అంతేకాకుండా.. స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఈ క్రమంలో గంటా శ్రీనివాస్ పిటిషన్ ఈనెల 29న విచారణకు రానుంది.
విశాఖలో బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రేపు ఘనతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో రిప్లబిక్ ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు వందల మీటర్లు పొడువైన జాతీయ జెండాతో వాక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు పిల్లలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే.. సాయంత్రం టాలీవుడ్ సింగర్ అరుణ్ కౌండిన్య, సింగర్ కారుణ్య రాబోతున్నట్లు తెలిపారు. జాతీయ,…
ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మిగనూరు పంచాయతీ సద్దుమణిగిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రచ్చకెక్కింది. ఇంతకుముందు ఎమ్మిగనూరు ఇంచార్జిగా మాచాని వెంకటేశ్వర్లను ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. అతన్ని తప్పించబోతున్నారు. అయితే వైసీపీ క్యాడర్ లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచాని పై సర్వే చేయించింది అధిష్టానం. కాగా.. సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో అధిష్టానం బుట్టా రేణుకను నియమించనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే చెన్న కేశవరెడ్డి అంగీకారంతో బుట్టా రేణుక నియామకం జరుగనుంది. ఈ నేపథ్యంలో ఎమ్మిగనూరు ఇంచార్జిగా మాజీ ఎంపీ…
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం సాయంత్రం జైపూర్‌కు చేరుకున్నారు. ఆయనకు జంతర్ మంతర్ వద్ద ప్రధానమంత్రి మోడీ స్వాగతం పలికారు. ప్రధాని మోదీ, అధ్యక్షుడు మాక్రాన్ కరచాలనం చేసి ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు చారిత్రక జంతర్‌మంతర్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కాగా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. రెండ్రోజుల పాటు భారత్ లో పర్యటించనున్నారు.
రేపు ఏపీ సీఎం జగన్ విజయవాడలో పర్యటించనున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. అందుకోసం.. ఉదయం 8.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు. రిపబ్లిక్ డే వేడుకలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో కలిసి సీఎం పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి తాడేపల్లికి తిరుగు పయనం కానున్నారు. సాయంత్రం 4.15 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆథిద్యం ఇచ్చే హై టీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.